తిరుపతి జూపార్క్‌లో దారుణం.. వ్యక్తిని చంపేసిన సింహం | Lion Kills Man At Tirupati Sri Venkateswara Zoological Park | Sakshi
Sakshi News home page

తిరుపతి జూపార్క్‌లో దారుణం.. వ్యక్తిని చంపేసిన సింహం

Published Thu, Feb 15 2024 4:18 PM | Last Updated on Thu, Feb 15 2024 6:25 PM

Lion Kills Man At Tirupati Sri Venkateswara Zoological Park - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతి ఎస్వీ జూపార్క్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని సింహం చంపేసింది.  గుర్తు తెలియని వ్యక్తి జూపార్క్‌లోని సింహం ఎన్ క్లోజర్‌లోకి దూకాడు. దీంతో సందర్శకుడిని  సింహం నోట కరచుకొని ఎత్తుకెళ్లి దాడి చేసి చంపేసింది. మృతుడిని రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్‌ గుర్జర్‌గా గుర్తించారు. సింహాన్ని ఎన్‌క్లోజర్‌ కేజ్‌లో అధికారులు బంధించారు.

సమాచారం అందుకున్న తిరుపతి రూరల్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై డీఎస్పీ శరత్‌రాజ్‌ జూ అధికారులను వివరాలు అడిగి  తెలుసుకుంటున్నారు.  అయితే సెల్ఫీ దిగడానికి సింహాల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడు.. భయంతో చెట్టు ఎక్కి కింద పడినట్లు తెలుస్తోంది. సింహం నోటికి చిక్కడంతో బాధితుడి తల భాగాన్ని సింహం పూర్తిగా తినేసినట్లు సమాచారం.

ఎస్వీ జూపార్క్లో సింహం దాడి ఘటనపై స్పందించిన జూ అధికారులు..
ఎస్వీ జూ పార్క్ క్యురేటర్ మీడియాతో మట్లాడారు. ‘మధ్యాహ్నం 2.30 గంటలు సమయంలో సింహం ఎంక్లోజర్లోకి ఓ వ్యక్తి దూకి వెళ్ళాడు. జూ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసే లోపే ఎన్‌క్లోజర్‌లోకి వెళ్ళాడు. సింహం మెడ ప్రాంతంలో నోట కరుచుకుని ఎత్తుకు వెళ్ళడంతో మృతి చెందాడు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రహ్లాద్ గుల్జార్గా గుర్తించాం. అతను ఒక్కడే వచ్చాడు. పోలీసులుకు, 108 సిబ్బందికి సమాచారం ఇచ్చాం. పోస్ట్మార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలింపు’ అని  తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement