
కుటుంబాన్ని చిరుతలు వెంబడిస్తున్న దృశ్యం
ఆమ్‌స్టర్‌డ్యామ్, నెదర్లాండ్ : ఫ్రెంచ్ కుటుంబం త్రుటిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుంది. నెదర్లాండ్‌లోని సఫారీ పార్కుకు ఓ ఫ్రెంచ్ కుటుంబం టూర్‌కు వెళ్లింది. పార్కు మధ్యలో చిరుతల గుంపు కనిపించడంతో కారును అక్కడే కాసేపు నిలిపారు.
కారులో నుంచి బయటకు దిగారు. సాహసం చేసిన మహిళ చిరుతల దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకున్నారు. ఆమె చేతిలో నెలల వయసున్న బిడ్డ ఉండటం గమనార్హం. చిరుతలు దాడి చేయడానికి యత్నించడంతో షాక్‌కు గురైన వారు కారు వైపు పరుగులు తీశారు. చిరుతలు వేగంగా చేరుకునే లోపు కారులోకి ఎక్కడంతో ప్రమాదం తప్పిపోయింది. ఘటనపై సఫారీ పార్కు అధికారులు విచారణకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment