చిరుతపై చిన్నారి (ప్రతీకాత్మక చిత్రం)
కంపాలా: ఉగాండలోని క్వీన్ ఎలిజిబెత్ నేషనల్ పార్క్‌లో చిన్నారి ఉదంతం విషాదంగా ముగిసింది. మూడేళ్ల పిల్లాడిని ఎత్తుకెళ్లిన చిరుత చంపి తినేసింది. చిన్నారి పుర్రె, దుస్తుల అవశేషాలను అధికారులు గుర్తించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
ఫారెస్ట్ రేంజర్ డోరీన్ అయేరా కొడుకు ఎలిషా నబుగ్యేరే(3) ఆయాతో క్వార్టర్స్ బయట ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి వెనకాలే వచ్చిన చిరుత ఒక్క దూటుతో లాక్కెల్లింది. ఆయా అరుపులు విన్న సిబ్బంది కాల్పులు ప్రారంభించగా చిరుత పొదల్లోకి పారిపోయింది. వెంటనే భారీగా అటవీ సిబ్బంది రంగంలోకి గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఆదివారం ఉదయం పిల్లాడి పుర్రె, దుస్తులు లభ్యం కావటంతో చిన్నారి మృతి చెందినట్లు అటవీ అధికారులు ప్రకటించారు. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది.
క్వార్టర్స్ వద్ద కంచె(ఫెన్సింగ్) లేకపోవటంతోనే చిరుత దాడి చేసిందని అధికారులు తెలిపారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై వేటు వేసినట్లు ఫారెస్ట్ అధికారి బషీర్ హంగ్ ప్రకటించారు. చిరుత మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో దానిని మట్టుపెట్టుందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment