కారు డోర్‌ ఓపెన్‌ చేయాలని చూసింది..కానీ | Lion Climbs On Top Of Car At Safari Park Goes Viral | Sakshi
Sakshi News home page

కారు డోర్‌ ఓపెన్‌ చేయాలని చూసింది..కానీ

Published Fri, Feb 21 2020 10:43 AM | Last Updated on Fri, Feb 21 2020 11:08 AM

Lion Climbs On Top Of Car At Safari Park Goes Viral - Sakshi

సాధారణంగా సఫారీ పార్క్‌లో సింహాలు వాహనాలను వెంబడించడం గమనిస్తూనే ఉంటాం. ఇంతకుముందు కూడా దానికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో తెగ హల్‌చల్‌ చేశాయి.  తాజాగా ఒక సింహం కారు మీదకు ఎక్కి కూర్చున్న వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో సింహం దర్జాగా ఒక కారు మీదకు ఎక్కి కూర్చుంది. తర్వాత కారు డోర్‌ ఓపెన్‌ చేయాలని ప్రయత్నించినా డోర్‌ లాక్‌ చేసి ఉండడంతో ఓపెన్‌ కాలేదు. దీంతో కొద్దిసేపటి వరకు కారుపై అలాగే ఉండిపోయింది. అయితే అదే సమయంలో  మరో రెండు సింహాలు వచ్చి కారును మొత్తం పరిశీలించాయి. ఈ నేపథ్యంలో కారు డ్రైవర్‌ మెల్లగా తన వాహనాన్ని కదిలించడంతో సింహం కిందకు దిగి పక్కనున్న పొదల్లోకి వెళ్లిపోయింది.

సఫారీ పార్క్‌కి వెళ్లే వీక్షకులు తమ సొంత వాహనాల్లో వెళితే ఎంత ప్రమాదకరమనేది ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. ఈ వీడియోనూ రెడ్డిట్‌ అనే సంస్థ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ' అదృష్టం బాగుంది కాబట్టి ఆ సింహాలు కారును ఏం చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఒకవేళ వాటికి చిర్రెత్తికొచ్చి కారుపై దాడి చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని' నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇకమీదట సఫారీ పార్క్‌కు వెళ్లేవారు సొంత వాహనాల్లో కాకుండా బస్‌లో వెళితే బాగుంటుందని నెటిజన్లు హెచ్చరించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement