
సాక్షి, అమరావతి: కోవిడ్ –19 వైరస్ వ్యాప్తి కారణంగా మూతపడిన అటవీశాఖకు చెందిన అన్ని జంతుప్రదర్శన శాలలు, నగర వనాలు, ఎకో టూరిజం పార్కులను వెంటనే తెరవాలని రాష్ట్ర అటవీ దళాధిపతి ఎన్. ప్రతీప్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్, విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్, కంబాలకొండలోని ఎకో టూరిజం పార్క్, రాష్ట్రంలోని నగరవనాలు, కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం కేంద్రాల్లోకి సందర్శకులను అనుమతించాలని ఆదేశించారు.
కేంద్ర హోం మంత్రిత్వశాఖ అనుమతించిన నిబంధలనల మేరకు అటవీశాఖకు సంబంధించిన అన్ని పార్కులు, నగరవనాలు, ఎకో టూరిజం కేంద్రాల్లోకి సందర్శకులను అనుమతించాలని రాష్ట్రంలోని సర్కిల్ కేంద్రాల అధిపతులు, డిఎఫ్‌ఓలను ఆదేశించారు. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో మూసివేసిన ఈ కేంద్రాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఆదేశాల మేరకు తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment