
మాడ్రిడ్: ఓ ఏనుగు తన తొండంతో గట్టిగా కొట్టి, ఎన్‌క్లోజర్ నుంచి జూ కీపర్‌ను బయటకు విసిరేసింది. దీంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన స్పెయిన్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. ఉత్తర స్పెయిన్‌లోని కాంటాబ్రియాలోని కాబార్సెనో నాచురల్ పార్క్‌లో జూ కీపర్ జోక్విన్ గుటిరెజ్ ఆర్నైజ్(44)పై ఆడ ఆఫ్రికన్ ఏనుగు తన తొండంతో దాడి చేసింది. దీంతో జూ కీపర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాపు చేస్తున్నామని తెలిపారు.
ఈ ఘటనపై స్పెయిన్ పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఏనుగు పాదానికి ఇన్‌ఫెక్షన్ అయినట్లు తెలుస్తోంది. ఆ గాయం స్థితిని తెలుసుకోవడానికి జూకీపర్ దాని వద్దకు వెళ్లాడు. అదే సమయంలో ఏనుగుకు దగ్గు రావటంతో అది ఒక్కసారిగా తన తొండాన్ని బలంగా ముందుకు విసిరింది. దీంతో దాని పాదాల వద్ద ఉన్న జూ కీపర్ ఎన్‌క్లోజర్ అవతలపడ్డాడని తెలిపారు. ఆ ఏనుగు తొండానికి చాల బలం ఉంటుందని, అది మనుషులకు తగిలితే బతకటం కష్టమని పేర్కొన్నాడు. ఈ ఘటన చోటు చేసుకోవటం బాధాకరం, 30 ఏళ్ల జూ చరిత్ర ఇటువంటి ప్రమాదం ఇదే మొదటిసారి జరిగిందని ఆయన తెలిపాడు.
చదవండి:
తమ్ముడి ఆత్మహత్య.. ఆవేదనతో అన్న కూడా
మాట్లాడుకుందామని పిలిచి మోడల్‌పై ఆత్యాచారం
Comments
Please login to add a commentAdd a comment