బాహుబలి సీన్ రిపీట్.. ఏనుగును ఆపడానికి.. | Man stops charging elephant by raising his hand | Sakshi
Sakshi News home page

బాహుబలి సీన్ రిపీట్.. ఏనుగును ఎలా కంట్రోల్ చేశాడంటే..

Published Sun, Jul 2 2023 7:08 PM | Last Updated on Mon, Jul 3 2023 7:34 PM

Man stops charging elephant by raising his hand - Sakshi

ఒక జంతు సందర్శనశాలలో ఏనుగులను చూడటానికి వచ్చిన పర్యాటకులకు షాకింగ్ సంఘటన ఎదురైంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న భారీ గజరాజు ఒక్కసారిగా తమవైపు దూసుకొచ్చింది. అంతలో మావటివాడు సైగ చేయడంతో ఆగిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు.  

ఫారెస్ట్ సఫారీలో భాగంగా ఏనుగులను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులకు ఏనుగులను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్న మావటి వాడిని చూసి ఏనుగు ఘీంకరించి తనవైపు దాడి చేయడానికి వేగంగా పరుగు తీసింది. మొదట పరధ్యానంగా ఉన్న మావటి వాడు తర్వాత స్పందించి అలా చేతిని పైకెత్తాడు. అంతే మదమెక్కిన ఆ ఏనుగు సైతం అలా ఉన్నచోటనే నిలిచిపోయింది. 

అతనింకా చేయ దించక ముందే ఆ ఏనుగు వెనక్కి అడుగులు వేసుకుంటూ తోక ముడిచింది. ఈ సన్నివేశం ఇపుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అచ్చం బాహుబలిలో ప్రభాస్ మదపుటేనుగుని నియంత్రించిన సీన్ చూసినట్టే ఉందని కామెంట్లు కూడా చేస్తున్నారు నెటిజన్లు. 

ఇది కూడా చదవండి: మూగజీవి సమయస్ఫూర్తి.. మనిషిని ఎలా సాయమడిగిందో చూడండి..   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement