పిలిప్పీన్స్ జూలో ఉన్న మాలి అనే వృద్ధ ఏనుగు చనిపోయింది. ఈ ఏనుగు ప్రంచంలోనే అత్యంత విషాదకరమైన ఏనుగుగా పేరుగాంచింది. ఐతే ఏనుగులు వృద్ధవి అయ్యి ఏదో ఒక రోజు చనిపోతాయి. ఇది సర్వసాధారణం. మరీ ఈ ఏనుగు మరణం, ఎందుకు? వార్తల్లో నిలిచింది. పైగా జంతు ప్రేమికులు, ప్రముఖులు దాని మరణానికి ఇంతలా స్పందిస్తూ సంతాపం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి. ఏంటీ ఆ ఏనుగు ప్రత్యేకత అంటే...
నాలుగా దశాబ్దాలు మనీలా జూలో ఆకర్షణగా నిలిచిన మాలి అనే వృద్ధ ఏనుగు మంగళవారమే మృతి చెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయినట్లు జూ అధికారలు తెలిపారు. ఈ ఏనుగు ఫిలిప్పీన్స్ జూ అధికారులు ఒక కాంక్రీట్ ఎన్‌క్లోజర్‌లో బందించారు. దీన్ని చూసిని పలువురు జంతు హక్కులు కార్యకర్తలు చలించిపోయి అభయారణ్యంలో వదిలేయాలని పలు విజ్ఞప్తులు, ఆందోళనలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ మాలి అనే ఏనుగు పేరు వార్తల్లో నిలిచింది. దీని గురించి క్యాథలిక్ బిషప్‌లు, గ్లోబల్ పాప్ స్టార్, నోబెల్ గ్రహిత కోయెట్జీ వంటి ప్రముఖులు దాని విడుదల కోసం మద్దతు తెలుపుతూ ఆందోళనలు చేశారు.
అంతేగాదు ఆ ఏనుగును థాయ్‌లాండ్ అభయారణ్యానికి తరలించాలని విజ్ఞప్తి చేస్తూ ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి పలు సంతాకాలతో కూడిన లేఖలను కూడా రాశారు. అయితే మాలీని మనీలా జూలోనే ఉంచాలనే నిర్ణయాన్ని పట్టుబట్టింది ఫిలిప్పీన్స్ ప్రభుత్వం. దీన్ని సమర్థించారు మనీలా నగర మేయర్ హనీ లాకున కూడా. అదీగాక ఆ ఏనుగు చాలా కాలం బందీగా ఉన్న కారణంగా బయట జీవించడం అసాధ్యం అని పేర్కొంది జూ. దీంతో సుదీర్ఘకాలం ఏకాంతంగా బంధీగా ఉన్న ఏనుగుగా పేరుగాంచింది. అందువల్ల జంతుప్రేమికులు ఈ ఏనుగుకు ప్రంచంలోనే అత్యం విషాదకరమైన ఏనుగుగా పిలిచారు.
ఎలా ఈ జూకి వచ్చిందంటే..
శ్రీలంక ప్రభుత్వం అప్పటి ఫిలిప్పీన్స్ ప్రథమ మహిళ ఇమెల్డా మార్కోస్‌కు 11 ఏళ్ల వయసులో ఉన్న ఈ చిన్న ఏనుగును బహుమతిగా ఇచ్చింది. అయితే ఈ ఏనుగుని జూకి తరలించడానికి ముందు మలాకానాంగ్ ప్యాలెస్‌లో ఉంది. ఆ తర్వాత మనీలా జూలో మాలిని 'షిబా' అనే మరో ఆడ ఏనుగుతో ఒక ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. మాలి దూకుడుగా ప్రవర్తించడంతో షిబా అనే ఏనుగు మరణించింది. దీంతో జూ అధికారులు దీన్ని నిర్బంధించారు. ఇలా ఏకాంత నిర్బంధంలోనే దశాబ్దాలుగా మగ్గిపోయింది. దీంతో పలువురు ప్రముఖులు, జంతు ప్రేమికులు దీని విడుదల కోసం ఎంతగానో యత్నించి విఫలమయ్యారు. కనీసం జంతు సంరక్షణ కేంద్రానికి తరలించమని కోరారు. అందుకు కూడా జూ అధికారులు ఒప్పుకోలేదు. అది ఇక్కడ ఇతర జంతువుల తోపాటు తమ కుటుంబంలో బాగమని స్పష్టం చేసింది జూ యాజమాన్యం.
చనిపోవడానికి కారణం..
ఈ మాలి ఏనుగు బాగోగులు చూసుకోకపోవడం వల్లే చనిపోయిందంటూ విమర్శలు వెల్లువలా వచ్చాయి. అదెంత మాత్రం నిజం కాదని కొట్టి పారేశాడు జూ పశువైద్యుడు హెన్రిచ్ డొమింగో. ఆ ఏనుగు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కారణంగా చనిపోయినట్లు వెల్లడించారు. జంతు ప్రేమికులు, సామజిక కార్యకర్తలు దాన్ని నిర్బంధించి భౌతికంగా ఎప్పుడో చంపేశారంటూ ఆరోపణలు చేశారు. కాగా, అంతేగాదు చనిపోయిన మాలి స్థానాన్ని భర్తీ చేసేలా శ్రీలంక అధికారులను మరో ఏనుగును ఇవ్వమని కోరింది. ఇక ఈ మాలి అస్థిపంజరాన్ని దాని గుర్తుగా జ్యూమ్యూజియంలో పెడతామని నగర మేయర్ లాకునా చెప్పారు.
(చదవండి: ఇలాంటి వ్యాపారమా అన్నారు? ఇప్పుడూ అదే కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతోంది)
Comments
Please login to add a commentAdd a comment