ఢిల్లీ: ఢిల్లీ జూలో ఉన్న 29 ఏళ్ల ఆఫ్రికన్ ఏనుగు ‘శంకర్’ ఆరోగ్యం, గొలుసుల బంధీ నుంచి విడిపించడానికి కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ చేసిన ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. ఆఫ్రికన్ ఏనుగు శంకర్ శుక్రవారం గొలుసుల నుంచి విముక్తి చేశారు. ఇప్పుడు ఆ ఏనుగు జూలోని తన ఎన్‌క్లోజర్‌లో చురుకుగా తిరుగుతోంది. అయితే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ‘ఎక్స్ వేదికగా వెల్లడించారు.
‘‘అక్టోబర్ 9న నేను జూని సందర్శించాను. ఆఫ్రికన్ ఏనుగు 'శంకర్'ను పరిశీలించాను. ఏనుగు ‘శంకర్’ ఆరోగ్యం కోసం పర్యావరణ మంత్రిత్వ శాఖ, జామ్‌నగర్‌కు చెందిన ‘వంతరా’ బృందం, నిపుణులైన వెటర్నరీ వైద్యుల బృందం చేసిన కృషికి ధన్యవాదాలు. అందులో నీరజ్, యదురాజ్, దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్, ఫిలిప్పీన్స్‌కు చెందిన మైఖేల్ ఉన్నారు. శంకర్ ఆరోగ్యం, పరిశీలనకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక కొనసాగుతోంది’’ అని అన్నారు.
"Following my visit to the zoo on 9th October and meeting with 'Shankar', the lone African elephant, we brought together the Ministry of Environment, Team Vantara from Jamnagar and the expert veterinary doctors. I am happy to share that 'Shankar' is finally free from chains.… pic.twitter.com/AN3pVFU2hi
— Kirti Vardhan Singh (@KVSinghMPGonda) October 11, 2024
ప్రస్తుతం జూలో ఉన్న మావటిలు.. శంకర్‌తో సులభంగా సంభాషించేలా శిక్షణ తీసుకుంటారని జూ అధికారులు తెలిపారు. ఏనుగు ‘శంకర్’ ప్రవర్తన , దినచర్యను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. శంకర్ పురోగతిని తనిఖీ చేయడానికి ఫిలిప్పీన్స్‌కు చెందిన మావటి మైఖేల్‌తో కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం శంకర్ గతంలో కంటే చాలా కనిపిస్తోందని జూ అధికారులు తెలిపారు.
1996లో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు జింబాబ్వే దౌత్య బహుమతిగా ఇచ్చిన ఈ ఏనుగు(శంకర్)ను సరిగా చూసుకోవడం లేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఢిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్ (జూ) సభ్యత్వాన్ని వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ జూస్ అండ్ అక్వేరియమ్స్ (వాజా) ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment