Massive Python Attacks Zookeeper For Trying To Take Her Eggs, Video Viral - Sakshi
Sakshi News home page

'గుడ్లను టచ్‌చేస్తే తాటతీస్తా..!' జూ కీపర్‌పై కొండ చిలువ వీరంగం..వీడియో వైరల్‌..

Published Sat, Jun 24 2023 7:02 PM | Last Updated on Sat, Jun 24 2023 8:49 PM

Massive Python Attacks Zookeeper For Trying to Take Her Eggs - Sakshi

ఏ జంతువులోనైనా అమ్మతనం అసామాన్యమైనది. పిల్లలను రక్షించుకోవడానికి ఎంతకైన తెగిస్తుంది తల్లి. సాధారణంగా మన ఇళ్లలో ఉండే కోడిని చూడండి.. దాని పిల్లల వైపు వచ్చిన ఏ జంతువునైనా ప్రాణాలకు తెగించి కొట‍్లాడుతుంది. అదీ అమ్మలోని గొప్పతనం. తాజాగా ఓ కొండ చిలువ తన గుడ్లను తీసుకోవడానికి వచ్చిన జూకీపర్‌పై విరుచుకుపడింది. అతను ఎన్నిసార్లు ప్రయత్నించినా.. గుడ్లను మాత్రం ముట్టుకోనీయలేదు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఓ పైథాన్‌ అందమైన గుడ్లను పెట్టింది. అవి భారీ సైజులో ఉన్నాయి. ఓ కుప్పగా ఉన్న తన గుడ్ల చుట్టూ చుట్టకుని ఆ కొండ చిలువ పడుకుని ఉంది. జూ కీపర్ జాయ్ బ్రూవర్ అది పడుకున్న రూమ్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. పైథాన్‌ను ఆటపట్టించాలనుకుంటాడు.  అనంతరం ఆ గుడ్లలోంచి ఓ గుడ్డును తీసుకునే ప్రయత్నం చేస్తాడు.  వెంటనే ఆ కొండ చిలువ బ్రూవర్‌ను కరవడానికి వస్తుంది. అతను ఎన‍్ని సార్లు ప్రయత్నించినా.. పైథాన్ మాత్రం గుడ్లను ముట్టుకోనీయదు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నెటిజన్లు భారీగా స్పందించారు. అమ్మతనంలోని గొప్పతనాన్ని కొనియాడారు. పైథాన్‌కు గుడ్లపై ఉన్న ప్రేమను కొనియాడుతూ కామెంట్లు పెట్టారు. అదీ.. అమ్మంటే అంటూ అని మరికొందరు స్పందించారు. 

ఇదీ చదవండి: ప్లీజ్‌ ఇలాంటి స్కూల్‌లో పిల్లలను చేర్పించకండి.. షాకింగ్‌ వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement