మిస్సౌరీ : 60 ఏళ్లు దాటిన తర్వాత పైతాన్‌లు గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని కోల్పోతాయని.. సంతాన్పోత్పత్తి జరిగే అవకాశం ఉండదని పలు పరిశోధనల్లో తేలింది. కానీ 62 ఏళ్ల బాల్ పైతాన్ ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా ఏడు గుడ్లను పెట్టింది. ఇక్కడ ఆశ్యర్యమేంటంటే గత 20 ఏళ్లుగా అది సంతానోత్పత్తికి దూరంగా ఉంటుంది. దీంతో పాటు అది ఎలాంటి మగ పైతాన్‌తో కలయిక లేకుండానే గుడ్లను పెట్టడం విశేషం. ఈ వింత ఘటన మిస్సౌరీలోని సెయింట్ లూయిస్ జూలో చోటుచేసుకుంది.(చదవండి : అలా సరదాగా రేసుకు వెళ్దామా!)
జూ మేనేజర్ మార్క్ వానర్ స్పందించాడు. 'ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం. సాధారణంగా బాల్ పైతాన్స్ 60 ఏళ్లు పైబడితే గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని కోల్పోతాయి. మా జూలో ఉన్న బాల్ పైతాన్ 20 ఏళ్లకు పైగా మగ పైతాన్‌తో కలయిక జరపలేదు. అయినా 62 ఏళ్ల వయసులో గుడ్లను పెట్టింది.. బహుశా బాల్ పైతాన్ మగ పైతాన్‌కు సంబంధించిన వీర్యం తన శరీరంలో ఒకచోట నిల్వ ఉంచుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ అండాన్ని విడుదల చేసి గుడ్లను పెట్టి ఉంటుంది.' అని తెలిపాడు.
ఈ విషయంపై సెయింట్ లూయిస్ జూ యాజమాన్యం స్పందించింది. జూలై 23 న బాల్ పైతాన్ 7 గుడ్లను పెట్టగా.. అందులో మూడింటిని ఇన్‌క్యూబేటర్‌లో ఉంచారు. రెండింటిని జెనిటిక్ శాంపిల్స్ కోసం పరీక్షించారు. మిగతా రెండు గుడ్లలో ఉన్నవి మాత్రం చనిపోయాయని తెలిపింది. అయితే జెనటిక్ శాంపిల్స్ కోసం గుడ్లను పరిక్షించిన తర్వాత ఆసక్తికర విషయం బయటిపడింది. బాల్ పైతాన్‌లో ఎలాంటి కలయిక లేకపోయినా(సెక్య్సుయల్ లేదా అసెక్య్సుయల్) వాటిలో పునరుత్పత్తి జరుగుతుందని.. దీనినే ఫ్యాకల్టేటివ్ పార్థినోజెనిసిస్ అంటారు. ఇప్పుడు సెయింట్ లూయిస్ జూలో ఒకటే మగ బాల్ పైతాన్ ఉందని.. దాని వయసు 31 ఏళ్లని యాజమాన్యం తెలిపింది. గుడ్లు పెట్టిన ఆడ బాల్ పైతాన్‌ను 1961లో ఒక వ్యక్తి జూకు విరాళంగా ఇచ్చాడని.. అప్పటినుంచి అది ఇక్కడే పెరుగుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment