జూలో ఆఫ్రికన్ కోతులు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో అరుదైన కోతి జాతులున్నాయి. ఇటీవల శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారులు వీటిని విశాఖ జూ పార్కుకు అప్పగించారు. అప్పటి నుంచి ఆ కోతులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. కొందరు ఒడిశా రాష్ట్రం మీదుగా వేరే చోటకు అనధికారికంగా ఆఫ్రికన్ జాతికి చెందిన రెండు కోతులను తరలిస్తుండగా శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారులకు పట్టుబట్టారు. వీటిని జూకు అప్పగించినట్టు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు.
వీటిని జూలో కోతుల జోన్‌లో ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో సందర్శకుల కోసం అందుబాటులో ఉంచామన్నారు. ఈ జాతి కోతులను ‘లోయిస్ట్ మంకీస్’ అని పిలుస్తారన్నారు. ఈ జాతి ఆఫ్రికా ఖండం కాంగో ప్రాంతంలో సంచరిస్తాయన్నారు. ఈ జాతి కోతులు మన దేశంలో ఎక్కడా కనిపించవని తెలిపారు. ఇవి అరుదైన జాతికి చెందినవని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment