
సాక్షి, వెబ్ డెస్క్ : ఆహారాన్ని అందిస్తూ మరీ దగ్గరకు వెళ్లిన బాలిక ముఖంపై గుద్దిన కోతి వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన చైనాలోని ఓ జూలో జరిగింది. ఓ మహిళతో పాటు ఆహారం తినిపించడానికి బాలిక కూడా కోతి వద్దకు వెళ్లింది.
మహిళ ఇస్తున్న ఆహారాన్ని కోతి తీసుకుంటుండగా, మధ్యలో బాలిక దానికి మరింత దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేసింది. అప్పటివరకూ శాంతంగా కనిపించిన కోతి బాలిక చర్యతో తన చేతిని విసిరింది. అంతే ఆ పంచ్ బాలిక ముఖాన్ని బలంగా తాకడంతో ఆమె వెనక్కు పడిపోయింది.