
ఏఆర్‌సీలో మృతి చెందిన ఆడ సింహంమాధురి(ఫైల్)
విశాఖపట్నం, ఆరిలోవ : జూపార్కు సమీపంలోని జంతు పునరావాస కేంద్రం(ఏఆర్‌సీ)లో శుక్రవారం ఓ వృద్ధ ఆడ సింహం మృతి చెందింది. జూ క్యూరేటర్ యశోదభాయి తెలిపిన వివరాలు ప్రకారం.. ఏఆర్‌సీలో ఉన్న మాధురి అనే 27 ఏళ్ల ఆడ సింహం వృద్ధాప్యం కారణంగా శరీర అవయవాలు పాడవడంతో అనారోగ్యానికి గురై మృతి చెందింది. దీన్ని 2001లో కోల్‌కతాలో జెమినీ సర్కస్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. దీని మరణంతో ప్రస్తుతం ఏఆర్‌సీలో ఆరు సింహాలు, మూడు పులులు ఉన్నాయి.