వాషింగ్టన్ : నేడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా వైరస్‌నుంచి రక్షణ పొందటానికి వ్యాక్సిన్ వేయించుకోవటం తప్పని సరైంది. దేశాలు, రాష్ట్రాలు ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లను అందిస్తున్నాయి. అయితే ప్రజలకు వ్యాక్సిన్ వేసే పక్రియ చాలా దేశాల్లో ఇంకా పూర్తికాలేదు. కొన్ని దేశాల్లో నత్తనడకన సాగుతోంది. ఇందుకు ప్రభుత్వాల వైఫల్యం ఓ కారణమైతే.. ప్రజల భయం మరో కారణం. కొంతమంది వ్యాక్సిన్ వేయించుకోవటానికి భయపడుతున్నారు. కానీ, అమెరికాలోని ఓ జూలోని జంతువులు వాలంటీర్‌గా వ్యాక్సిన్ వేయించుకుంటున్నాయి. వ్యాక్సిన్ వేసే వాళ్లకు ఇబ్బంది కలిగించకుండా సహకరిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. అమెరికా.. కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా జూలోని జంతువులకు ఈ మధ్యే ఓ ప్రయోగాత్మక వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు.
గత వారం జూలోని జింజర్, మోలీ అనే పులులకు వ్యాక్సిన్ వేశారు. జూ అధికారి అలెక్స్ హెర్మన్ దీనిపై మాట్లాడుతూ.. ‘‘ జూలోని ఏ జంతువుకు కరోనా సోకలేదు. కానీ, వాటికి రక్షణ కల్పించటం ముఖ్యం. పులులు, ఎలుగు బంట్లు, పర్వత సింహాలు, ఫెర్రెట్స్‌కు మొదటి డోస్ వేశాము. ఆ తర్వాత కోతులకు, పందులకు మొదటి డోస్ వేస్తాము. ఈ వ్యాక్సిన్‌ను న్యూజెర్సీలోని వెటర్నరీ ఫార్మాసూటికల్స్ కంపెనీ ‘జొయోటిస్’ తయారు చేసి ఇచ్చింది’’అని పేర్కొన్నాడు.
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న పులులు, సింహాలు..
Published Mon, Jul 5 2021 3:15 PM | Last Updated on Mon, Jul 5 2021 5:30 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment