సాధారణంగా సాధుజంతువులతో మనకి నచ్చినట్లు ప్రవర్తిస్తుంటాం. కానీ పులి, సింహం, ఏనుగులాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకుంటే వాటికి తిక్కరేగితే అంతే సంగతులు. ఇక ప్రత్యేకంగా సింహం గాండ్రింపు వింటేనే హడలిపోయేవాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా సింహాలతోనే సెల్ఫీ దిగడమే కాకుండా వాటితో వీడియోలు కూడా తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వివరాల్లోకి వెళితే.. అతని పేరు హుమైద్ అబ్దుల్లా అల్బుకైష్. యూఏఈకి చెందిన పెద్ద వ్యాపారవేత్త. దుబాయ్‌లోని అత్యంత ధనవంతులలో హుమైద్ ఒకరు. అతను ఎమిరేట్స్ నేషనల్ ఆయిల్ కంపెనీ (ఈఎన్‌ఓసీ) సీఈఓ. అతను తన లగ్జరీ లైఫ్‌స్టైల్, సింహాల పెంపకం, వాటితో వీడియోల ద్వారా సోషల్ మీడియాలో స్టార్‌గా కూడా మారాడు. అంతేకాకుండా అతనికి జంతువుల మీద ఉన్న ప్రేమ కారణంగా అల్బుకైష్ జంగిల్ అనే ఒక ప్రైవేట్ జూని నడుపుతున్నాడు. ఎడారి మధ్యలో ఉండే ఈ జూలో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, ఇతర జంతువులున్నాయి. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఒక సింహం చెట్టుపైకి ఎక్కగా, మరో రెండు కింద ఉన్నాయి. హుమైద్ వాటికి కొంతదూరంలోనే సెల్ఫీ తీసుకుని సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment