
సింహాన్ని చూడ్డానికి మనం జూకు వెళ్తాం.. సింహానికే మనల్ని చూడాలనిపించింది అనుకోండి.. ఇదిగో ఈ రివర్స్ జూకు వస్తుంది.. అంటే.. జంతువులు బయట తిరుగుతూ ఉంటే.. మనం బోనులో ఉండటమన్నమాట.
దక్షిణాఫ్రికాలోని హారిస్మిత్‌లో ఉన్న జీజీ సింహాల అభయారణ్యంలో ఈ వినూత్న బోనును ఏర్పాటు చేశారు. దీని వల్ల సందర్శకులకు కూడా వాటిని దగ్గర నుండి చూసే అనుభూతి కలుగుతుందని అభయారణ్యం నిర్వాహకులు చెబుతున్నారు. భద్రత విషయంలో ఎలాంటి భయాలూ అక్కర్లేదని.. దీన్ని తరచూ ఇంజనీర్లతో తనిఖీలు చేయిస్తామని పేర్కొంటున్నారు.