
వాషింగ్టన్ : ప్రేమలో వైఫల్యం కారణంగా పగిలిన హృదయాన్ని అతికించటం అంత వీజీ కాదు!. ఆ బాధనుంచి బయటపడటానికి ఒకరకంగా మనసుతో మనిషి యుద్ధం చేయాల్సి ఉంటుంది. అయినా అందులో విజయం సాధిస్తామన్న నమ్మకంలేదు. చాలా మంది భగ్న ప్రేమికులు దూరమైన వాళ్లను తలుచుకుంటూ తమలో తాము కుమిలిపోతూ ఉంటారు. మాటల్లోనో.. చేతల్లోనో వాళ్లను గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటారు. అలాంటి వాళ్ల కోసం అమెరికా, టెక్సాస్‌లోని శాన్ ఆంటానియో జూ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ( వీధి కుక్క మృతి.. కాలనీలో వెలసిన పోస్టర్లు)
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున ‘‘ క్రై మీ ఏ కాక్‌రూచ్’ అనే ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. జూలోని బొద్దింకలు, ఎలుకలకు తమ మాజీల పేర్లు పెట్టుకునే, ప్రేమికుల రోజున వాటితో వేరే జంతువుల కడుపునింపే మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. బొద్దింకకు రూ. 370, ఎలుకకు రూ.1800లు చెల్లించాల్సి ఉంటుంది. మనం బహుమతిగా ఇచ్చే వీటిని ఇతర జంతువులకు ఆహారంగా వేస్తారు. శాకాహార జంతువులకు శాకాహారం బహుమతిగా ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇందుకోసం ఐదు డాలర్లు (370 రూపాయలు) చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment