వాషింగ్టన్: మనుషులు పుట్టిన రోజు జరుపుకోవడం సర్వసాధారణం. అయితే జంతుప్రేమికులు కొన్నిసార్లు తమ పెంపుడు జంతువులకు కూడా పుట్టిన రోజు వేడుకలు చేస్తుంటారు. అయితే తాజాగా డెన్వర్ జూలో ఒక ఖడ్గమృగం తన పుట్టినరోజున తనే స్వయంగా కీబోర్డ్‌ను ప్లే చేసింది. జూలోని బంధు అనే ఖడ్గమృగానికి 12 సంవత్సరాలు నిండాయి. దాంతో బంధుకు పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 18 వేల మంది వీక్షించగా..వందల మంది లైక్ కొట్టారు.
"మా జూలో ఉండే కొమ్ము గల మగ ఖడ్గమృగానికి ఈ రోజుతో 12 ఏళ్లు నిండాయి. ఇది తన పుట్టినరోజు. అయితే బంధు స్వయంగా తాను రాసిన ఒక ప్రత్యేక పాటతో మీ అందరికీ చికిత్స చేయాలనుకున్నాడు. తన పుట్టినరోజున మానసికంగా, శారీరకంగా ఉత్తేజపరిచేందుకు అనేక మార్గాలలో ట్యూన్ కంపోజ్ చేయడానికి అతని ప్రిహెన్సిల్ పెదవిని ఉపయోగించాడు." అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
కాగా, దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "పుట్టినరోజు శుభాకాంక్షలు బంధు! అవును! ఆ పెద్ద పిల్లవాడిని ప్రేమించండి! " అంటూ కామెంట్ చేశాడు. "జంతువులకు నాకన్నా ఎక్కువ ప్రతిభ ఉంది" అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment