
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అన్ని జూ పార్క్‌లు మూసివేస్తున్నట్లు అటవీశాఖ ప్రకటించింది.
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అన్ని జూ పార్క్‌లు మూసివేస్తున్నట్లు అటవీశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జూ లతో పాటు ఎకో టూరిజం సెంటర్లు, టెంపుల్ ఎకో పార్క్‌లు మూసివేయాలని నిర్ణయించింది. జూ పార్క్‌ల్లో జంతువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అటవీశాఖ ఆదేశించింది.
ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూ..
కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రేపట్నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు ఇబ్బంది పడకుండా నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తూ సడలింపు కల్పిస్తారు. ఆ సమయంలో ఐదుగురికి మించి గుమికూడరాదు. మధ్యాహ్నం 12 తరువాత షాపులన్నీ తప్పనిసరిగా మూసివేయాలి. అత్యవసరాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.
చదవండి:
తాళం వేసిన ఇంట్లో నుంచి దుర్వాసన.. తెరిచి చూస్తే షాక్..
రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి..