ఆరిలోవ(విశాఖ తూర్పు): ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు గురువారం మరికొన్ని వన్యప్రాణులు వచ్చాయి. జంతు మార్పిడి పద్ధతిపై ఇతర జూ పార్కుల నుంచి ఇక్కడకు కొత్త వన్య ప్రాణులను అధికారులు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతిలోని వేంకటేశ్వర జూ పార్కు నుంచి గురువారం మూడు గ్రే జంగిల్ ఫౌల్(మగ–1, ఆడ–2), జత వైల్డ్ డాగ్స్, అడవి దున్న, జత చౌసింగా తీసుకొచ్చారు.
చదవండి: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్ విషయాలు
వీటికి బదులుగా విశాఖ జూ నుంచి జత హైనాలు, మగ అడవి దున్న, రెండు ఆడ నక్కలు పంపించినట్లు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. ఈ నెల 13న చండీగఢ్‌లోని ఛత్బీర్ జూ పార్కు నుంచి మొసలి జాతికి చెందిన ఘరియల్స్(2 మగవి), రెడ్ జంగిల్ ఫౌల్స్(మగవి–2, ఆడవి–4), లెసర్ విజ్లింగ్ టీల్స్(మగది–1, ఆడవి–2), బార్న్ ఔల్స్(మగ–1, ఆడవి–2), హైనా( మగది–1) ఇక్కడకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment