1996 Zoo Incident: Gorilla Carries 3 Year Old Boy To Safety After He Fell Into Enclosure - Sakshi
Sakshi News home page

1996 Zoo Incident: ప్రత్యేక విందు,ప్రపంచ దృష్టిని ఆకర్షించిన గోరిల్లా.. ఇంతకీ ఏం చేసింది?

Published Thu, Jun 22 2023 4:06 PM | Last Updated on Fri, Jul 14 2023 4:18 PM

1996 Zoo Incident: Gorilla Carries 3 Year Old Boy To Safety After He Fell Into Enclosure - Sakshi

గోరిల్లాలు చూడటానికి కాస్త భయంకరంగా కనిపించినా వాటి మనస్సు మంచిదే. 1996 నాటి జూ ఘటనలో మూడేళ్ల పిల్లాడిని కాపాడింది ఓ గోరిల్లా. అప్పట్లో ఈ సంఘటన చాలా పాపులర్‌. అప్పటిదాకా జూను చూడటానికి వచ్చిన జనాలు కూడా ఈ సంఘటన తర్వాత ప్రత్యేకించి ఆ గోరిల్లాను చూడటినికి వచ్చేవారట. అంతలా అభిమానాన్ని చాటుకున్న గోరిల్లా కథేంటి? అసలు ఏం జరిగింది?

1996లో మూడేళ్ల బాలుడ్ని ఓ గోరిల్లా కాపాడిన ఘటన గుర్తుంది కదా..ఇల్లినాయిస్‌లోని బ్రూక్‌ఫీల్డ్‌ జూలో 8ఏళ్ల బింటి జువా అనే గోరిల్లా తన ఎన్‌క్లోజర్‌లో పడిపోయిన బాలుడ్ని రక్షించింది. గోరిల్లా ఎగ్జిబిట్‌ చుట్టూ ఉన్న గోడను ఎక్కుతూ సుమారు 24 అడుగుల ఎత్తు నుంచి  బాలుడు ఎన్‌క్లోజర్‌లోకి పడిపోయాడు. ఆ బిడ్డను జాగ్రత్తగా తీసుకొని తన ఒళ్లో కూర్చోబెట్టుకొని తల్లిలా కాపాడింది. ఆ తర్వాత జూ సిబ్బంది సమన్వయంతో ఆ బాలుడు క్షేమంగా బయటపడ్డాడు.

ఈ ఘటనలో అంత ఎత్తునుంచి పడిపోవడంతో బాలుడి చేయి, ముఖంపై గాయాలు మినహా మరేం జరగలేదు. నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉండి ఆ బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. ఈ ఘటన అప్పట్లో అంతర్జాతీయ మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. గోరిల్లాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. గోరిల్లా బిడ్డను ఒళ్లో కూర్చోబెట్టుకున్న దృశ్యం అందరినీ కట్టిపడేసింది. అంతే ఆ ఫోటోలు, వీడియాలో నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి.

అప్పటిదాకా జూను చూడటానికి వచ్చిన వారు కూడా ఈ ఘటన తర్వాత గోరిల్లాను చూడటానికి వచ్చేవారట. దీంతో సందర్శకుల తాకిడి బాగా పెరిగి ఆ గోరిల్లాకు స్టార్‌ స్టేటస్‌ వచ్చిందట.అటు జూ సిబ్బంది కూడా గోరిల్లాకు ప్రత్యేకమైన విందు ఏర్పాటుచేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 35ఏళ్ల వయసున్న గోరిల్లా బింటి జువా ఇప్పటికీ సజీవంగా ఉంది. ముగ్గురు మనవరాళ్లతో పాటు మునివడిని కూడా చూసుకుంటూ కాలం వెళ్లదీస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement