
అహ్మదాబాద్: భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెటర్లను దేవుళ్లగా కొలిచేవారికి మన దేశంలో కొదవ లేదు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ప్రాణం ఇచ్చే ఎంతో మంది వారి స్థాయితో సంబంధం లేకుండా వారి టాలెంట్‌తో టీం ఇండియాలో స్థానం దక్కించుకొని గొప్ప ప్లేయర్లుగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఒక ఆణిముత్యానికి సంబంధించిన వీడియోని ఈఎస్‌పీఎన్ తన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. (‘ధోని కెప్టెన్ కాకుండా ఉంటే?: గంభీర్)
జామ్‌నగర్‌కు చెందిన మిలాన్ పటేల్ అనే బుడ్డోడు పిట్టకొంచెం కూత ఘనం అనే చందాన ఒక్కొక్క బాల్‌ను బౌండరీలు దాటేలా కొట్టాడు. తన చిన్న చేతుల్లో ఎంత శక్తి ఉందో అంతటిని ఉపయోగించి ఒక్కో బంతిని చుట్టూ ఉండే భవనాలంత ఎత్తుకు కొడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఈఎస్‌పీఎన్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా దానిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మన దేశంలో అవకాశం రావాలే కానీ వీధికొక సచిన్ ఉన్నాడని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఆ షాట్స్‌కు తుఫాన్ రావడం ఒక్కటే మిస్ అయ్యింది అని మరొకరు కామెంట్ చేశారు. (చెమట పట్టకపోతే ఏం చేస్తారు?)
Comments
Please login to add a commentAdd a comment