ESPN Cricinfo
-
21వ శతాబ్దపు అత్యుత్తమ జట్టు.. ధోని, రోహిత్‌లకు నో ప్లేస్..!
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో నిపుణులు 21వ శతాబ్దపు భారతదేశపు అత్యుత్తమ టెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్‌ను ఎంపిక చేశారు. ఈ జట్టుకు సారధిగా విరాట్ కోహ్లి ఎంపిక కాగా.. వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్ మిగతా సభ్యులుగా ఉన్నారు. 12వ ఆటగాడిగా మొహమ్మద్ షమీ ఎంపికయ్యాడు. ఈ జట్టులో స్టార్ ప్లేయర్లు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మకు చోటు దక్కలేదు.కాగా, భారత జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాన్పూర్ వేదికగా రేపటి నుంచి (సెప్టెంబర్ 27) రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ (113, 6 వికెట్లు), జడేజా (86, 5 వికెట్లు), శుభ్‌మన్ గిల్ (119 నాటౌట్), రిషబ్ పంత్ (109) అద్భుతంగా రాణించారు. ఈ నలుగురు టీమిండియా విజయంలో ప్రధానపాత్ర పోషించారు. చదవండి: మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడిన హోప్, హెట్‌మైర్ -
'రోజులో 90 ఓవర్లు వేయకపోతే ఇంకెందుకు?.. సస్పెండ్ చేయాల్సిందే'
టెస్టు క్రికెట్ అంటే ఐదు రోజుల మ్యాచ్. రోజుకు 90 ఓవర్లు చొప్పున ఐదు రోజుల పాటు 450 ఓవర్లు అందుబాటులో ఉంటాయి. ఒకప్పుడు టెస్టు మ్యాచ్ అంటే కచ్చితంగా రోజులో 90 ఓవర్లు బౌలింగ్ చేయడం ఆనవాయితీగా వచ్చేది. కానీ రానురాను పరిస్థితి మారిపోయింది. స్లో ఓవర్ రేట్ .. వెలుతురులేమి.. వర్షం అంతరాయం ఇలా ఎన్నో అడ్డంకులు వస్తుండడంతో రోజులో 90 ఓవర్ల ఆట సాధ్యమవడం లేదు. అయితే వర్షం అంతరాయం, వెలుతురులేమి వదిలేస్తే ఓవర్ రేట్ అనేది మన చేతుల్లో పని. - సాక్షి వెబ్‌డెస్క్ మ్యాచ్ ప్రారంభమైన సమయం నుంచి టైంను వృథా చేయకుండా బౌలింగ్ చేస్తే కచ్చితంగా రోజులో 90 ఓవర్లు పూర్తి చేయొచ్చు. ఆయా జట్ల కెప్టెన్లు ఇలా చేయలేక అనవసరంగా జరిమానాలు.. కొత్తగా డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత పడుతుంది. ఇవన్నీ నష్టాన్ని కలిగించేవి. తాజాగా ఆస్ట్రేలియన్ దిగ్గజం ఇయాన్ చాపెల్ టెస్టు క్రికెట్లో వస్తున్న మార్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోలో చాపెల్ ఇదే అంశంపై తన కాలమ్‌లో రాసుకొచ్చాడు. ''టెస్టు మ్యాచ్‌లు అనేవి ఎప్పుడు ఆసక్తిగానే ఉంటాయి. వన్డే, టి20 క్రికెట్ వచ్చినా సంప్రదాయ ఫార్మాట్‌కు ఉన్న మోజు మాత్రం తగ్గలేదు. అయితే ఇప్పుడున్న టెస్టు క్రికెట్లో ప్రధానంగా వేధిస్తున్న సమస్య రోజులో 90 ఓవర్లు బౌలింగ్ పూర్తి చేయలేకపోవడం. వాతావరణ సమస్య.. వెలుతురులేమి ఇతరత్రా కారణాలు వదిలేస్తే మ్యాచ్‌లో మరో కీలకఅంశం ముడిపడి ఉంది. అదే ఓవర్ రేట్. వన్డేలు, టి20లు ఒక్కరోజులో ముగిసేవి కాబట్టి స్లోఓవర్ రేట్ పడడం సాధారణం. కానీ టెస్టులు ఐదు రోజుల పాటు జరిగేవి. సరిగ్గా వినియోగించుకుంటే రోజులో కచ్చితంగా 90 ఓవర్లు బౌలింగ్ చేయొచ్చు. అలా చేయని పక్షంలో జట్టు కెప్టెన్ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒక టెస్టులో తమ బౌలర్లతో రోజులో 90 ఓవర్లు బౌలింగ్ చేయించకపోతే కెప్టెన్‌ను సస్పెండ్‌ను చేసే అంశాన్ని పరిగణించాలి. దీనివల్ల టెస్టు క్రికెట్లో కొంతైనా మార్పు వస్తుంది. ఇటీవల ఇంగ్లండ్, టీమిండియాల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 90 ఓవర్ల ఆట కాస్త కనబడింది. దాదాపు మూడురోజులు ఇరు జట్లు 90 ఓవర్ల ఆట పూర్తి చేయడానికి మొగ్గుచూపాయి. ఇది అభినందిచాల్సిన విషయం. కొన్ని డీఆర్ఎస్లు సమయాన్ని వృథా చేయడంతో ఓవర్‌రేట్ పడడంతో మూడు నాలుగు ఓవర్లు మిగిలిపోయాయి. అందుకే ఓవర్ రేట్లపై తక్షణ శ్రద్ధ అవసరం. అంపైర్లు ఈ విషయంలో ఆన్-ఫీల్డ్ ప్రోటోకాల్‌ను అమలు చేయలేరు ఎందుకంటే వారికి అధికారాలు లేకపోవడమే. ఇక బౌలర్లు ఆరు గంటల్లో 90 ఓవర్లు బౌలింగ్ చేసేలా ప్రోత్సహించాలి. ఈ లక్ష్యం నెరవేరకపోతే కెప్టెన్‌ను ప్రశ్నించకుండా సస్పెండ్ చేయాలి. దశాబ్దాలుగా ఓవర్‌రేట్ అనేది టెస్టు క్రికెట్‌కు ఇబ్బందిగా మారింది. దీనివల్ల టెస్టు ఆటకు ముప్పు ఉందని'' చాపెల్ పేర్కొన్నాడు. చదవండి: MS Dhoni: లండన్ వీధుల్లో ధోనికి వింత అనుభవం England Cricketer Reece Topley: ఇంగ్లండ్ స్టార్ రీస్ టాప్లీ.. ఐదేళ్ల క్రితం కథ వేరే Yasir Shah: రీఎంట్రీలోనూ సంచలనమే.. పాక్ బౌలర్ ప్రపంచ రికార్డు -
ఆశ్చర్యపరుస్తున్న బుల్లి సచిన్
అహ్మదాబాద్: భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెటర్లను దేవుళ్లగా కొలిచేవారికి మన దేశంలో కొదవ లేదు. చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ప్రాణం ఇచ్చే ఎంతో మంది వారి స్థాయితో సంబంధం లేకుండా వారి టాలెంట్‌తో టీం ఇండియాలో స్థానం దక్కించుకొని గొప్ప ప్లేయర్లుగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఒక ఆణిముత్యానికి సంబంధించిన వీడియోని ఈఎస్పీఎన్ తన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. (‘ధోని కెప్టెన్ కాకుండా ఉంటే?: గంభీర్) జామ్‌నగర్‌కు చెందిన మిలాన్ పటేల్ అనే బుడ్డోడు పిట్టకొంచెం కూత ఘనం అనే చందాన ఒక్కొక్క బాల్‌ను బౌండరీలు దాటేలా కొట్టాడు. తన చిన్న చేతుల్లో ఎంత శక్తి ఉందో అంతటిని ఉపయోగించి ఒక్కో బంతిని చుట్టూ ఉండే భవనాలంత ఎత్తుకు కొడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఈఎస్పీఎన్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా దానిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మన దేశంలో అవకాశం రావాలే కానీ వీధికొక సచిన్ ఉన్నాడని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. ఆ షాట్స్‌కు తుఫాన్ రావడం ఒక్కటే మిస్ అయ్యింది అని మరొకరు కామెంట్ చేశారు. (చెమట పట్టకపోతే ఏం చేస్తారు?) -
వన్డే, టీ20లకు ధోని.. టెస్టులకు కోహ్లి
యావత్ క్రికెట్ ప్రపంచం టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లి నామస్మరణతో మునిగితేలుతుండటంతో ఎంఎస్ ధోని ప్రాశస్త్యం రోజురోజుకి తగ్గిపోతుందని అతడి ఫ్యాన్స్ నిరాశకు గురువుతున్నారు. అయితే అతడు సాధించిన విజయాలు, ఘనతలను వెలికి తీస్తూ ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలను మాజీ క్రికెటర్లు, పలు సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఈ దశాబ్దపు ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్‌గా ధోనిని ఎంపిక చేస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా ఆసక్తికర నిర్ణయాన్ని ప్రకటించింది. దీనిపై జార్ఖండ్ డైనమెట్ ఫ్యాన్స్ అమితానందం వ్యక్తం చేశారు. తాజాగా వారికి మరింత జోరు కలిగించే వార్త ప్రముఖ క్రీడా ప్రసార సంస్థ ఈఎస్పీఎన్ తెలిపింది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకటించిన ఈ దశాబ్దపు వన్డే, టీ20 జట్లకు సారథిగా ఎంఎస్ ధోనిని ఎంపిక చేసింది. అయితే టెస్టు జట్టుకు సారథిగా విరాట్ కోహ్లి వైపే మొగ్గు చూపింది. 23 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ పలు అంశాలను పరిగణలోకి తీసుకుని టెస్టు, వన్డే, టీ20 జట్లను ప్రకటించినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ దశాబ్దంలో ఆరేళ్లకు పైగా ఆడి ఉండి లేక కనీసం 50 టెస్టులైనా ఆడిన ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని టెస్టు జట్టును ప్రకటించినట్టు ఈఎస్పీఎన్ తెలిపింది. అదేవిధంగా కనీసం 75 వన్డేలు, 100 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల రికార్డులను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు వివరించింది. ఇక టెస్టు జట్టులో కోహ్లితో పాటు టీమిండియాకు చెందిన మరో ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే చోటు దక్కించుకున్నాడు. ఇక వీరితో పాటు ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ అలిస్టర్ కుక్, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్‌లు టెస్టు జట్టులో ఉన్నారు. వన్డేల్లో ధోని, కోహ్లిలతో పాటు రోహిత్ శర్మకు అవకాశం దక్కింది. టీ20 ఫార్మట్ విషయానికొస్తే వెస్టిండీస్ ఆటగాళ్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఏకంగా ఐదుగురు కరీబియన్ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవో, సునీల్ నరైన్, పొలార్డ్‌లతో పాటు ఆండ్రీ రసెల్‌లు టీ20 జట్టులో ఉన్నారు. ఇక టీమిండియా నుంచి ధోనితో పాటు కోహ్లి, జస్ప్రిత్ బుమ్రాలు అవకాశం దక్కించుకున్నారు. మహిళల క్రికెట్ విషయానికి వస్తే మిథాలీ రాజ్, జులాన్ గోస్వామిలు ఇద్దరు వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకోగా.. ఈ రెండు ఫార్మట్లకు ఆసీస్ క్రికెటర్ మెగ్ లాన్నింగ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. -
రోహిత్ కెప్టెన్.. కోహ్లికి నో ఛాన్స్
న్యూఢిల్లీ: ప్రముఖ క్రీడల వెబ్సైట్ ఈఎస్పీఎన్ 2017 సంవత్సరానికి క్రికెట్ జట్లను ప్రకటించింది. గతేడాది గొప్పగా రాణించిన క్రికెటర్లతో మూడు ఫార్మాట్లకు టీమ్‌లను ఎంపిక చేసింది. ఆయా ఆటగాళ్లకు ఓట్లు వేయాలని వీక్షకులకు సూచించింది. ఈఎస్పీఎన్ ఎంపిక వన్డే జట్టుకు విరాట్ కోహ్లిని కెప్టెన్‌గా పెట్టింది. టెస్టు టీమ్‌కు స్టీవ్ స్మిత్, టి20 జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. అనూహ్యంగా టి20 టీమ్‌లో కోహ్లికి చోటు దక్కలేదు. టెస్టు జట్టులో కోహ్లి, చతేశ్వర్ పుజారా మాత్రమే ఉండగా, మన బౌలర్లు చోటు సంపాదించలేకపోయారు. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. వన్డే, టి20లోనూ చోటు దక్కించుకున్నాడు. వన్డే టీమ్‌లో ఐదుగురు టీమిండియా ఆటగాళ్లు ఉండటం విశేషం. టెస్ట్ టీమ్: స్టీవ్ స్మిత్(కెప్టెన్), డీన్ ఎల్గర్, డేవిడ్ వార్నర్, పుజారా, విరాట్ కోహ్లి, షకీల్ అల్, ముషాఫిర్ రహీం, లియన్, రబడ, ఆండర్సన్, నీల్ వాగ్నర్ వన్డే జట్టు: కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, డీ కాక్, జోయ్ రూట్, బాబర్ అజామ్, హార్దిక్ పాండ్యా, స్టోక్స్, హసన్ అలీ, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ టి20 టీమ్: రోహిత్ శర్మ(కెప్టెన్), లూయిస్, మెక్కల్లమ్, హాషిమ్ ఆమ్లా, బట్లర్, క్రిస్టియాన్, కీరన్ పొలార్డ్, సునీల్ నరైన్, రషీద్ ఖాన్, హసన్ అలీ, జస్ప్రీత్ బుమ్రా -
సచిన్‌కు మరో పురస్కారం!
ముంబై: భారత మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మరో ప్రతిష్టాత్మక అవార్డును అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ‘ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో’ ప్రదానం చేయనున్న ‘ఈ తరం క్రికెటర్’ అవార్డు రేసులో సచిన్ ముందంజలో ఉన్నాడు. ‘ క్రిక్ఇన్ఫో’ వెబ్సైట్ 20వ వార్షికోత్సవం సందర్భంగా 1993 నుంచి 2013 వరకు క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి ‘ఈ తరం క్రికెటర్’ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు కోసం విఖ్యాత మాజీ క్రికెటర్లు లారా, మురళీధరన్ పోటీపడినా.. తుది జాబితాలో ‘మాస్టర్’తోపాటు ఆస్ట్రేలియా మేటి స్పిన్నర్ షేన్ వార్న్, దక్షిణాఫ్రికా స్టార్ కలిస్ చోటు సంపాదించారు. ఈ 20 ఏళ్ల కాలంలో ఈ ముగ్గురు లెజెండరీ క్రికెటర్లు తమ కెరీర్లో అద్భుతమైన ఆటతీరును కనబరిచారు. మాస్టర్ సచిన్ బ్యాటింగ్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టించగా... వార్న్ తన స్పిన్ మ్యాజిక్‌తో అద్భుతాలు చేశాడు. ఇక కలిస్ సూపర్ ఆల్‌రౌండర్‌గా అందరి మన్ననలు పొందాడు. దీంతో 50 మంది సభ్యుల జ్యూరీ సచిన్, వార్న్, కలిస్‌లను తుది జాబితాకు ఎంపిక చేసింది. ఈ జ్యూరీలో అంతర్జాతీయ క్రికెటర్లు, మాజీలు, క్రికెట్ రచయితలు, టీవీ వ్యాఖ్యాతలు ఉన్నారు. తిరుగులేని మాస్టర్... క్రికెట్ కెరీర్లో లెక్కలేనన్ని అవార్డులు అందుకున్న సచిన్ ‘ఈ తరం క్రికెటర్’ అవార్డు రేసులో వార్న్, కలిస్‌లకు అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇప్పటికే సచిన్‌కు 65 శాతానికిపైగా ఓట్లు పడ్డాయి. సచిన్ జోరు ముందు వార్న్, కలిస్లు వెనకబడిపోయారు. అయితే ఈ ఓటింగ్‌లో మీరూ పాల్గొనవచ్చు. ఠీఠీఠీ.్ఛటఞఛిటజీఛిజీజౌ. ఛిౌఝ వెబ్సైట్లోకి లాగిన్ అయి ‘ఈ తరం క్రికెటర్’ను ఎంపిక చేయవచ్చు. విజేతగా నిలిచిన వారికి నేడు ముంబైలో జరిగే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేస్తారు.