ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో నిపుణులు 21వ శతాబ్దపు భారతదేశపు అత్యుత్తమ టెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్‌ను ఎంపిక చేశారు. ఈ జట్టుకు సారధిగా విరాట్ కోహ్లి ఎంపిక కాగా.. వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్ మిగతా సభ్యులుగా ఉన్నారు. 12వ ఆటగాడిగా మొహమ్మద్ షమీ ఎంపికయ్యాడు. ఈ జట్టులో స్టార్ ప్లేయర్లు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మకు చోటు దక్కలేదు.
కాగా, భారత జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాన్పూర్ వేదికగా రేపటి నుంచి (సెప్టెంబర్ 27) రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ (113, 6 వికెట్లు), జడేజా (86, 5 వికెట్లు), శుభ్‌మన్ గిల్ (119 నాటౌట్), రిషబ్ పంత్ (109) అద్భుతంగా రాణించారు. ఈ నలుగురు టీమిండియా విజయంలో ప్రధానపాత్ర పోషించారు.
చదవండి: మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడిన హోప్, హెట్‌మైర్
Comments
Please login to add a commentAdd a comment