Ind Vs Sl: నీకు కూడా కావాలా.. రా తీస్కో.. నువ్వు మరీనూ రోహిత్‌.. వైరల్‌ | Ind Vs Sl 2nd T20: Rohit Sharma Offers Coffee To Cameraperson Video Viral | Sakshi
Sakshi News home page

Ind Vs Sl- Rohit Sharma: నీకు కూడా కావాలా.. రా తీస్కో.. వద్దా..! నువ్వు మరీనూ రోహిత్‌.. వైరల్‌ వీడియో!

Published Sun, Feb 27 2022 3:35 PM | Last Updated on Sun, Feb 27 2022 3:44 PM

Ind Vs Sl 2nd T20: Rohit Sharma Offers Coffee To Cameraperson Video Viral - Sakshi

Ind Vs Sl T20 Series: రోహిత్‌ శర్మ.. టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అతడు పట్టిందల్లా బంగారమే అవుతోంది. ముఖ్యంగా స్వదేశంలో పొట్టి ఫార్మాట్‌లో వరుస విజయాలతో రికార్డులు సృష్టిస్తున్నాడు హిట్‌మ్యాన్‌. ప్రపంచకప్‌-2022 నేపథ్యంలో ఆటగాళ్లను రొటేట్‌ చేస్తూనే మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాడు. ఈ క్రమంలో మైదానంలో ఆటగాళ్లు చిన్న చిన్న తప్పిదాలు చేసినా సహించే ప్రసక్తే లేదన్నట్లుగా ముందుకు సాగుతున్నాడు. అక్కడిక్కడే వార్నింగ్‌లు ఇస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఇదంతా నాణేనికి ఒకవైపు.

ఆట విషయం పక్కనపెడితే సహచర క్రికెటర్లతో రోహిత్‌ ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి చిన్నపిల్లాడిలా మారిపోయి.. వారిసి ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇక శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్‌ సందర్భంగా తనలోని హాస్యచతురతను మరోసారి బయపెట్టాడు హిట్‌మ్యాన్‌. మ్యాచ్‌కు వేదికైన ధర్మశాల(హిమాచల్‌ ప్రదేశ్‌)లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణం చల్లగా ఉన్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో రోహిత్‌ కాఫీని ఆస్వాదిస్తుండగా.. కెమెరాలు అతడి మీద ఫోకస్‌ చేశారు. ఈ విషయాన్ని గమనించిన రోహిత్‌ శర్మ తాను బిగ్‌స్క్రీన్‌ మీద కనబడుతున్నానని తెలుసుకుని.. కెమెరామెన్‌కు కాఫీ ఆఫర్‌ చేశాడు. ఆ తర్వాత నవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోక్లిప్‌ను బీసీసీఐ షేర్‌ చేయగా అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇదిలా ఉండగా.. ఆదివారం ధర్మశాలలో జరుగననున్న మూడో టీ20లోనూ విజయం సాధించి లంకను క్లీన్‌స్వీప్‌ చేసేందుకు రోహిత్‌ సేన సన్నద్ధమవుతోంది. 

చదవండి: Ind Vs Sl 3rd T20: ఇప్పటి వరకు 27 మందిని ఆడించాం.. ఇక: రోహిత్‌ శర్మ
MS Dhoni IPL Promo: గుర్తుపట్టలేనంతగా మారిన ఎంఎస్‌ ధోని.. ఏం జరిగింది
T20 WC 2022- Virat Kohli: ప్రపంచకప్‌ ప్రోమో వీడియో! బిగ్గెస్ట్‌ ప్లేయర్‌గా కోహ్లి.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ బాబూ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement