ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 137 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 101 పరుగులతో గిల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. గిల్‌కు ఇది నాలుగో టెస్టు సెంచరీ.
ఓవరాల్‌గా అయితే శుబ్‌మన్ 11వ అంతర్జాతీయ సెంచరీ. ఈ సిరీస్‌లో మాత్రం గిల్‌కు ఇది రెండో సెంచరీ. కాగా జైశ్వాల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన గిల్.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 160 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.
హిట్‌మ్యాన్ కూడా తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 102 పరుగులతో గిల్ క్రీజులో ఉన్నాడు. ఇక రెండో రోజు లంచ్ విరామానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 264 పరుగులు చేసింది. ప్రస్తుతం 46 పరుగుల ఆధిక్యంలో టీమిండియా కొనసాగుతోంది.
చదవండి: #RohitSharma: వారెవ్వా.. శతక్కొట్టిన రోహిత్.. 48వ సెంచరీ
Apni ballebaazi se jeete har dil, kamaal khele Shubman Gill 💯🫶#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/VBpIakUekG
— JioCinema (@JioCinema) March 8, 2024
Comments
Please login to add a commentAdd a comment