అనురాగ్ ఠాకూర్‌తో రోహిత్ , ద్రవిడ్ (PC: X)
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్య క్రీడా భారత్ రూపుదిద్దుకునే కార్యక్రమంలో చిత్తశుద్ధితో పాల్గొనడం రోహిత్ హుందాతనానికి నిదర్శనమని ప్రశంసించారు.
కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌తో రోహిత్ శర్మ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగింట మూడు విజయాలతో ట్రోఫీని కైవసం చేసుకున్న టీమిండియా.. ధర్మశాల వేదికగా గురువారం నుంచి నామమాత్రపు ఐదో టెస్టు ఆడనుంది.
అయితే, నాలుగు- ఐదో టెస్టుకు మధ్య విరామం ఎక్కువగా ఉండటంతో రోహిత్ శర్మ సతీసమేతంగా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్నాడు. గుజరాత్‌లో జరిగిన ఈ సెలబ్రేషన్స్ అనంతరం తిరిగి విధుల్లో చేరేందుకు ధర్మశాల(హిమాచల్ ప్రదేశ్)కు పయనం కావాల్సింది.
అయితే, అంతకంటే ముందు భారత క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హమీర్‌పూర్ నియోజకవర్గంలోని బిలాస్‌పూర్‌కు చేరుకున్నాడు. అక్కడ జరిగిన ఖేల్ మహాకుంభ్ 3.0 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నాడు. రోహిత్ శర్మతో పాటు టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఉండటం విశేషం.
ఈ నేపథ్యంలో అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘ఖేల్ మహాకుంభ్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఉదయం ఐదున్నర గంటలకే రోహిత్ శర్మ ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఒకవేళ రోహిత్ అనుకుంటే.. మార్చి 7న ఆరంభం కానున్న ఐదో టెస్టును సాకుగా చూపి ఇక్కడికి రాకుండా మా ఆహ్వానాన్ని తిరస్కరించి ఉండవచ్చు.
కానీ అతడికి భవిష్య క్రీడా భారత్ ఇలాంటి కార్యక్రమాల నుంచే రూపుదిద్దుకుంటోందని తెలుసు. అందుకే ఇక్కడకు వచ్చాడు. అతడికి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.
కాగా ఈ ఈవెంట్ ఆరంభించిన అనంతరం రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ కాసేపు బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో బిలాస్‌పూర్‌కు దాదాపు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మశాలకు చేరుకున్నారు.
చదవండి: 100th Test: అశ్విన్‌పై మాజీ స్పిన్నర్ సంచలన ఆరోపణలు
Swung for the fences and had a blast with Hitman @ImRo45 and The Wall Rahul Dravid at the grand opening of #SansadKhelMahakumbh 3.0 at Luhnu Cricket Stadium, Bilaspur.
— Anurag Thakur (मोदी का परिवार) (@ianuragthakur) March 5, 2024
Truly a game to remember! pic.twitter.com/ENRaSOr6Y8
Comments
Please login to add a commentAdd a comment