
India Vs Sri Lanka T20 Series: వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా మరో గెలుపుపై కన్నేసింది. శ్రీలంకతో జరిగే రెండో టీ20 మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవడంతో పాటు అత్యధిక వరుస విజయాల ప్రపంచ రికార్డును నెలకొల్పాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు.. మొదటి మ్యాచ్‌లో ఓటమితో డీలా పడిన శ్రీలంక ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప గెలిచే సూచనలు కనిపించడం లేదు.
వనిందు హసరంగ, మహీశ్ తీక్షణ, కుశాల్ మెండిస్ వంటి ఆటగాళ్లు దూరం కావడంతో ఆతిథ్య జట్టుతో పోలిస్తే మరింత బలహీనంగా అనిపిస్తోంది. శనివారం ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ నేపథ్యంలో.. ఎప్పుడు, ఎక్కడ జరుగనుంది? పిచ్ వాతావరణం, తుది జట్ల అంచనా, ముఖాముఖి రికార్డు తదితర వివరాలు..
ఎక్కడ, ఎప్పుడు?
భారత్ వర్సెస్ శ్రీలంక- రెండో టీ20
హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల
ఫిబ్రవరి 26(శనివారం)- రాత్రి ఏడు గంటలకు ఆరంభం
తుదిజట్ల అంచనా:
టీమిండియా:
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, వెంకటేశ్‌అయ్యర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్.
శ్రీలంక:
నిరోషన్ డిక్‌వెలా(వికెట్ కీపర్), పాథుమ్ నిసంక, చరిత్ అసలంక, జనిత్ లియానగే, ధనుంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నె, దుష్మంత చమీర, జెఫ్రే వాండెర్సే, ప్రవీణ్ జయవిక్రమ, లాహిరు కుమార.
పిచ్ వాతావరణం
ధర్మశాల మైదానంలో చివరి టీ20 మ్యాచ్‌ల 2016లో జరిగింది. కాబట్ ఈ మ్యాచ్‌లో పిచ్ ఎలా స్పందిస్తుందో చెప్పడం కష్టమే. ఇంకా వర్ష సూచన కూడా ఉంది.
ముఖాముఖి పోరులో రికార్డులు
ఇప్పటి వరకు టీమిండియా- శ్రీలంక మధ్య 23 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ 15, లంక ఏడింటిలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ రద్దయింది. ఇక సొంతగడ్డపై శ్రీలంకపై 9-2 తేడాతో భారత జట్టు విజయాల పరంగా అద్బుత రికార్డు కలిగి ఉంది. మొత్తంగా భారత్‌లో 16 టి20లు ఆడిన శ్రీలంక 12 మ్యాచ్‌లలో ఓడింది.
చదవండి: Ranji Trophy 2022: కూతురు పోయిన బాధను దిగమింగి శతకంతో మెరిసే..