Asia Cup, 2023- India vs Sri Lanka, Final: ఆసియా కప్-2023 ఫైనల్‌కు ముందు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ టీమిండియాను హెచ్చరించాడు. శ్రీలంకను తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నాడు. సొంతగడ్డపై పటిష్టంగా కనిపిస్తున్న దసున్ షనక బృందాన్ని ఓడించడం అంత తేలికేమీ కాదని వార్నింగ్ ఇచ్చాడు.
బంగ్లాదేశ్ చేతిలో ఓటమి ఊహించారా?
కొలంబో వేదికగా ఆదివారం టీమిండియా- శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓడిపోతుందని ఊహించామా? కానీ అదే జరిగింది.
అలాగే పాకిస్తాన్ శ్రీలంక చేతిలో ఓడిపోయింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. బంగ్లా చేతిలో టీమిండియా ఓటమి కంటే పాక్ నిష్క్రమణ మరీ ఘోరం. ఏదేమైనా.. ఇప్పటికీ భారత జట్టుకు అవకాశం ఉంది. వాళ్లు ఫైనల్ ఆడబోతున్నారు.
టీమిండియా సత్తాకు పరీక్ష
కానీ అంతకంటే ముందే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో పరాజయం వారికి కనువిప్పు కలిగించిందనే అనుకుంటున్నా. కఠినంగా శ్రమించి.. వ్యూహాలు పక్కాగా అమలు చేస్తేనే ఫైనల్లో అనుకున్న ఫలితం రాబట్టగలరు. శ్రీలంకను ఓడించడం అనుకున్నంత సులువు కాదు. టీమిండియా సత్తాకు పరీక్ష ఇది.
శ్రీలంకను తక్కువ అంచనా వేయకండి
రోహిత్ సేనను ఎలాగైనా ఓడించి ట్రోఫీ గెలవాలని శ్రీలంక కాచుకుని కూర్చుంది. ప్రపంచకప్ టోర్నీకి ముందు ఏ జట్టుకైనా ఇలాంటి విజయాలు అవసరం. ఐసీసీ ఈవెంట్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. ఇప్పటికైనా టీమిండియా కళ్లు తెరవాలి. బంగ్లాదేశ్ చేతిలో ఓటమిని మర్చిపోవద్దు’’ అని చెప్పుకొచ్చాడు.
సమిష్టిగా రాణిస్తూ విజయపరంపర
కాగా స్టార్లు ప్లేయర్లు లేకుండా.. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంక ఒక్కో అవరోధం దాటుకుంటూ ఫైనల్ వరకూ చేరుకుంది. ఇక గతేడాది టీ20 ఫార్మాట్లో ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ విజేతగా దసున్ షనక జట్టు నిలిచిన విషయం తెలిసిందే. సమిష్టిగా రాణించడం శ్రీలంకకు బలం. ఈ నేపథ్యంలోనే రోహిత్ సేనను ఉద్దేశించి అక్తర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
చదవండి: ఆర్సీబీ పేసర్‌కు లక్కీ ఛాన్స్! టీమిండియాలో చోటు.. బీసీసీఐ ప్రకటన
WC 2023: పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ! ఆసియా కప్ పోయింది.. ఇక..
Comments
Please login to add a commentAdd a comment