రోడ్డు ప్రమాదంలో ఆర్మీ అభ్యర్థి మృతి | 22-yr-old man killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ అభ్యర్థి మృతి

Published Thu, Feb 15 2018 3:41 PM | Last Updated on Wed, Apr 3 2019 8:03 PM

22-yr-old man killed in road accident 	 - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ధర్మశాల : ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి వెళ్తున్న ఓ యువకుడు గురువారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన హర్యానా రాష్ర్టంలోని ధర్మశాలకు 50 కి.మీ దూరంలో జరిగింది. స్థానికంగా నివాసముంటన్న ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా పాప్రొలా గ్రామం వద్ద హర్యానా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం మాండి-పఠాన్‌కోట్‌ జాతీయరహదారిపై జరిగింది.

మృతుడు స్థానికంగా నివాసముంటున్న జుగల్‌(22)గా గుర్తించారు. పాలంపూర్‌లో జరిగే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి హాజరవ్వడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో గ్రామస్తులు జాతీయ రహదారిని బ్లాక్‌ చేసి ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకు దిగిన వాళ్లని చెదరగొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement