
ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత బౌలర్ల దాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు వివిలవిల్లాడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో ఇంగ్లండ్‌ను దెబ్బతీయగా.. అశ్విన్ రెండు, జడ్డూ వికెట్ సాధించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ క్రాలే మినహా మిగితా బ్యాటర్లు నిరాశపరిచారు.
హిట్‌మ్యాన్ సూపర్ క్యాచ్..
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. స్లిప్‌లో అద్భుతమైన క్యాచ్‌ను హిట్‌మ్యాన్ అందుకున్నాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 49 ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్‌లో నాలుగో బంతికి మార్క్ వుడ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని ఫస్ట్‌స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమలో స్లిప్‌లో ఉన్న రోహిత్ అద్భుతమైన లో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
— Bangladesh vs Sri Lanka (@Hanji_CricDekho) March 7, 2024
Comments
Please login to add a commentAdd a comment