
యశస్వి జైస్వాల్ (PC: BCCI)
Ind vs Eng 5th Test- Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు.
సొంతగడ్డపై ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు బాదిన యశస్వి జైస్వాల్.. ధర్మశాలలో జరుగుతున్న ఆఖరి టెస్టులోనూ తనదైన షాట్లతో అలరిస్తున్నాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ బ్యాట్‌తో వీరవిహారం చేస్తున్నాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న అరుదైన రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు.
ఇంగ్లండ్‌తో తాజా టెస్టులో.. భారత ఇన్నింగ్స్‌లో తొమ్మిదవ ఓవర్ ముగిసే సరికి యశస్వి జైస్వాల్ మూడు సిక్స్‌లు కొట్టాడు. తద్వారా ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా బ్యాటర్‌గా జైస్వాల్ అవతరించాడు.
సచిన్ రికార్డు బద్దలు కొట్టి
గతంలో సచిన్ టెండుల్కర్ ఆస్ట్రేలియా మీద 25 సిక్సులు కొట్టగా.. జైస్వాల్ తాజాగా ఇంగ్లండ్‌పై 26వ సిక్సర్‌ను బాది.. అతడిని అధిగమించాడు. ఇక సచిన్‌కు ఇందుకోసం 74 ఇన్నింగ్స్ అవసరం కాగా.. జైస్వాల్ కేవలం 9 ఇన్నింగ్స్‌లోనే ఈ సిక్సర్ల రికార్డు క్రియేట్ చేయడం విశేషం.
కాగా ధర్మశాల మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.
ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్లు
26* - యశస్వి జైస్వాల్ ఇంగ్లండ్ మీద(9 ఇన్నింగ్స్)
25- సచిన్ టెండుల్కర్ ఆస్ట్రేలియా మీద(74 ఇన్నింగ్స్)
22- రోహిత్ శర్మ సౌతాఫ్రికా మీద(20 ఇన్నింగ్స్)
21- కపిల్ దేవ్ ఇంగ్లండ్ మీద(39 ఇన్నింగ్స్)
21- రిషభ్ పంత్ ఇంగ్లండ్ మీద (21 ఇన్నింగ్స్).
Yashasvi goes BIG & how! 🔥
— BCCI (@BCCI) March 7, 2024
Follow the match ▶️ https://t.co/jnMticF6fc#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/NRqpSKAg2K