
యుద్ధమంటే మనిషికీ, మనిషికీ మధ్య విభజన రేఖ. ప్రేమతో ఆ విభజన రేఖను చెరిపేశారు రష్యా యువకుడు, ఉక్రెయిన్ యువతి. ఆరు నెలలుగా ఇరుదేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ముగిసే అవకాశాలు కనిపించడం లేదు. ఆ ద్వేషాన్ని ప్రేమతో జయించొచ్చని నిరూపించారు రష్యాకు చెందిన సెర్జెయ్ నొవికోవ్ ఇజ్రాయెల్‌లో స్థిరపడ్డాడు. ఉక్రెయిన్‌కు చెందిన ఎలోనా బమ్రోకా. వారిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఏడాది కాలంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని ధరంకోట్‌లో నివాసం ఉంటున్నారు.
అయితే ధర్మశాలలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు సొంత ఇంటిదగ్గరే ఉన్నామన్న భావన కలిగించేలా స్థానికులే సంప్రదాయ క్రతువులన్నీ పూర్తి చేశారు. జానపద నృత్యాలతో పండుగను తలపించారు. ధర్మశాల సమీపంలోని దివ్య ఆశ్రమ్ ఖరోటాలో పండితుడు సందీప్ శర్మ వేద మంత్రాలు చదువుతుండగా ఇద్దరూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. వారి పొరుగునే ఉంటున్న వినోద్ శర్మ... కన్యాదానం చేశారు. పెళ్లికి వధూవరుల మిత్రులు కూడా హాజరై విదేశీ పెళ్లిని పక్కా దేశీ స్టైల్‌లో ఘనంగా జరిపించారు.
చదవండి: 42 అడుగుల గోళ్లు.. గిన్నిస్ రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment