![Donald Trump Key Statement On Russia Ukraine Conflict](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/trumpukraine.jpg.webp?itok=rUGAIjDU)
వాషింగ్టన్:రెండోసారి అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.దీనిలో భాగంగా రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్దాన్ని ఆపేస్తానని ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్ ఏదో ఒకరోజు రష్యాలో భాగం కావొచ్చు..కాకపోవచ్చు అని ట్రంప్ అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయినియన్లు.. రష్యన్లు కావొచ్చు..కాకపోవచ్చన్నారు. ఈ విషయంలో ఆ రెండు దేశాలు ఒక ఒప్పందానికి రావొచ్చు రాకపోవచ్చని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. రష్యా,ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న తన రాయబారి కీత్ కెల్లాగ్‌ను త్వరలో ఉక్రెయిన్‌కు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వచ్చేవారం మ్యానిచ్‌లో జెలెన్‌స్కీతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఉక్రెయిన్‌పై తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా,సుమారు మూడేళ్లుగా ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితులు కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment