
వన్డే ప్రపంచకప్-2023లో న్యూజిలాండ్ తొలి ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఆక్టోబర్ 22న ధర్మశాల వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మెగా ఈవెంట్‌లో కివీస్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 28న ధర్మశాల వేదికగానే ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే తమ తర్వాతి మ్యాచ్‌కు దాదాపు 6 రోజుల బ్రేక్ రావడంతో ధర్మశాలలోని సుందరమైన ప్రదేశాలను కివీస్ జట్టు ఆటగాళ్లు చుట్టేస్తున్నారు.
ఈ క్రమంలో బౌధ్దమత గురువు దలైలామాను ఆయన నివాసంలో కివీస్ ఆటగాళ్లు కలిశారు. క్రికెటర్లతో పాటు వారి కుటంబ సభ్యులు కూడా ఉన్నారు. దలైలామాతో కలసి ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దలైలామాను కలిసిన న్యూజిలాండ్ క్రికెటర్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, శాంట్నర్ వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. ఇక ఈ మెగా టోర్నీ పాయింట్ల పట్టికలో కివీస్ ప్రస్తుతం రెండో స్ధానంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment