న్యూజిలాండ్ క్రికెట్ జట్టు 10 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా కివీస్ మూడు వన్డేలు, రెండు టెస్టులు అతిథ్య బంగ్లాదేశ్‌తో ఆడనుంది. కివీస్ రెండు దఫాలుగా బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లనుంది. తొలి దశ పర్యటనలో మూడు వన్డేలు న్యూజిలాండ్ ఆడనుంది. అనంతరం రెండో దశలో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాతో న్యూజిలాండ్ తలపడనుంది.
ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారింగా దృవీకరించింది. సెప్టెంబర్ 21న ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం నవంబర్ 28 నుంచి టెస్టు సిరీస్ మొదలు కానుంది. కాగా వన్డే ప్రపంచకప్ సన్నహకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. ఈ వన్డే సిరీస్ ముగిసిన అనంతరం ఇరు జట్లు ప్రపంచకప్ కోసం భారత్‌కు రానున్నాయి.
ఇక చివరిగా 2013లో కివీస్ బంగ్లా పర్యటనకు వెళ్లింది. అప్పుడు రెండు టెస్టుల సిరీస్ డ్రా కాగా.. మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లా 3-0తో కివీస్‌ను వైట్‌వాష్ చేసింది. ఏకైక టీ20లో మాత్రం న్యూజిలాండ్ విజయం సాధించింది. కాగా న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉంది. ఈ టూర్‌లో అతిథ్య యూఏఈతో మూడు టీ20ల సిరీస్‌లో కివీస్ తలపడుతోంది. ఇప్పటికే దుబాయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్ ఘన విజయం సాధించింది.
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. ఎప్పుడూ అలా ఫీలవ్వలేదు! నా టార్గెట్ అదే: బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment