వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజులో మాథ్యూస్ ఔటైన విధానం తీవ్ర వివాదస్పదమైంది. ఈ మ్యాచ్‌లో మాథ్యూస్ దురదృష్టకర రీతిలో 'టైమ్డ్ ఔట్'గా పెవిలియన్‌కు చేరాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 'టైమ్డ్ ఔట్'గా వెనుదిరిగిన తొలి క్రికెటర్‌గా మాథ్యూస్ నిలిచాడు.
నిర్ధేశించిన సమయంలోపు అతడు బంతిని ఎదర్కోనందుకు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ టైమ్డ్ ఔట్‌కు అప్పీల్ చేశాడు. దీంతో రూల్స్ ప్రకారం మాథ్యూస్‌ను అంపైర్‌లు ఔట్‌గా ప్రకటించారు.
ఏంటి టైమ్డ్ ఔట్..
మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) రూల్స్ ప్రకారం.. ఒక బ్యాటర్ ఔటైనా లేదా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినా తర్వాత క్రీజులోకి వచ్చే బ్యాటర్ 3 నిమిషాల్లోపు(180 సెకన్లు) బంతిని ఎదుర్కొవాలి. ఒకవేళ అలా జరగని పక్షంలో ఇన్‌కమింగ్ బ్యాటర్‌ను టైమ్డ్ ఔట్ రూల్ కింద ఔట్‌గా ప్రకటిస్తారు.
క్లారిటీ ఇచ్చిన ఫోర్త్ అంపైర్..
ఇక ఈ వివాదంపై ఫోర్త్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్ క్లారిటీ ఇచ్చాడు. "ఐసీసీ వరల్డ్‌కప్ రూల్స్ మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ చట్టాల కంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. నిబంధనల ప్రకారం.. వికెట్ పడిన తర్వాత లేదంటే, బ్యాటర్ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగితే ఇన్‌కమింగ్ బ్యాటర్ రెండు నిమిషాల్లో బంతిని ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలి.
ప్లేయింగ్ కంట్రోల్ రూమ్‌లో ఉన్న మేము కొన్ని ప్రోటోకాల్‌లను అనుసరిస్తాము. వికెట్ పడిన వెంటనే టీవీ అంపైర్(థర్డ్ అంపైర్) ప్రాథమికంగా రెండు నిమిషాలు ఎదురుచూసి.. అప్పటికి ఆట తిరిగి ప్రారంభం కాకపోతే ఆన్‌ఫీల్డ్ అంపైర్‌లతో సంప్రదింపులు జరుపుతాడు.
ఉదాహరణకు ఈ మ్యాచ్‌లో జరిగిన సంఘటను తీసుకుంటే.. బ్యాటర్‌కు తన హెల్మెట్ స్ట్రాప్ ఊడిపోయిందనే గమనించే సమయానికే రెండు నిమిషాలు దాటిపోయింది. నిర్ణీత సమయానికి అతడు బంతిని ఎదుర్కొనుందుకు సిద్దంగా లేడు. హోల్డ్‌స్టాక్ చెప్పుకొచ్చాడు.
ఎవరు ముందుగా అప్పీలు చేశారు?
ఈ మ్యాచ్‌లో ముందుగా ఫీల్డింగ్ కెప్టెన్ షకీబుల్ హసన్.. స్టాండింగ్ అంపైర్ మరైస్ ఎరాస్మస్‌కి అప్పీల్ చేశాడు. అప్పటికే సమయం ముగియడంతో షకీబుల్ అప్పీల్ చేయాలనుకున్నాడని ఆయన వెల్లడించాడు.
ముందే చెక్ చేసుకోవాలి..
ఇక బ్యాటర్‌గా మనం క్రీజులోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నప్పుడు ముందే మనం చెక్ చేసుకోవాలి. మనకు సంబంధించిన హెల్మెట్, ప్యాడ్స్ వంటివి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని ఫీల్డ్‌లోకి రావాలి. ఎందుకంటే ప్లేయర్ రెండు నిమిషాల్లో బంతిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలి. బ్యాటర్లు తమకు సంబంధించిన కిట్స్(హెల్మెట్, ప్యాడ్స్, గ్లావ్స్) సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి 50 సెకన్లలోపు క్రీజులోకి చేరుకోవాలి. లేదంటే ఇటువంటి పరిస్ధితులు ఎదురవతాయి అని హోల్డ్‌స్టాక్ పేర్కొన్నాడు.
చదవండి: WC 2023: బంగ్లాదేశ్ అప్పీలు.. మాథ్యూస్ అవుట్! అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి!
Comments
Please login to add a commentAdd a comment