వన్డే ప్రపంచకప్-2023 మరో 6 రోజుల్లో తెరలేవనుంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కివీస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు.
విలియమ్సన్ పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడని న్యూజిలాండ్ క్రికెట్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే వార్మప్ మ్యాచ్‌ల్లో మాత్రం కేన్ ఆడుతాడని న్యూజిలాండ్ క్రికెట్ సృష్టం చేసింది. శుక్రవారం పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో విలియమ్సన్ కేవలం బ్యాటర్‌గా మాత్రమే బరిలోకి దిగనున్నాడు.
అదే విధంగా సోమవారం తిరువనంతపురంలో దక్షిణాఫ్రికాతో జరిగే తదుపరి వార్మప్ మ్యాచ్‌లో ఫీల్డింగ్, బ్యాటింగ్ రెండూ కేన్ చేసే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్-2023 తొలి మ్యాచ్ సందర్భంగా కేన్ విలియమ్సన్ మోకాలికి తీవ్ర గాయమైంది. దీంతో అతడు స్వదేశానికి వెళ్లి మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఆటకు విలియమ్సన్ దూరంగా ఉన్నాడు. కానీ ఫిట్‌నెస్ సాధించేందుకు అతడు తీవ్రంగా శ్రమించాడు. ఆక్టోబర్ 9న నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌కు విలియమ్సన్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
చదవండి: ICC ODI WC 2023: ప్లేయర్స్ ఫీవర్‌తో బాధపడ్డారు.. వరల్డ్ కప్ ప్రిపరేషన్స్‌పై ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment