సచిన్, రూట్(ఫైల్ ఫోటో)
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ నిలిచాడు. హైదరాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 10 పరుగుల వక్యిగత స్కోర్ రూట్ ఈ ఘనతను అందుకున్నాడు.
రూట్ ఇప్పటివరకు 45 ఇన్నింగ్స్‌లలో 2555 పరుగులు చేశాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. భారత్-ఇంగ్లండ్ టెస్టుల్లో సచిన్ 53 ఇన్నింగ్స్‌లలో 2535 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో సచిన్ ఆల్ టైమ్ రికార్డు బద్దలైంది. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి(1991) ఐదో స్ధానంలో ఉన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు లంచ్ విరామానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(18), జానీ బెయిర్ స్టో(32) పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు, జడేజా ఒక్క వికెట్ సాధించారు.
చదవండి: IND vs ENG: రోహిత్ శర్మ కళ్లు చెదిరే క్యాచ్.. ఇంగ్లండ్ బ్యాటర్ మైండ్ బ్లాంక్ ! వీడియో
Comments
Please login to add a commentAdd a comment