India vs England, 1st Test: ఇంగ్లండ్‌తో టెస్టులో టీమిండియా యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ ఆట తీరుపై భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పెదవి విరిచాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో నిలదొక్కుకోవాలంటే గిల్ తన బ్యాటింగ్ టెక్నిక్‌ను మరింత మెరుగుపరచుకోవాలని సూచించాడు.
రాహుల్ ద్రవిడ్, ఛతేశ్వర్ పుజారాల మాదిరి ఆడితే ఈ యువ ప్లేయర్‌కు టెస్టుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో శుబ్‌మన్ గిల్ ఇబ్బంది పడుతున్నాడని... బలహీనతలు అధిగమించడంపై దృష్టి సారించాలని హితవు పలికాడు.
కాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం తొలి టెస్టు ఆరంభమైంది. ఉప్పల్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన గిల్.. 66 బంతులు ఎదుర్కొని 23 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.
స్ట్రైక్ రొటేట్ చేయడం నేర్చుకో
ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్ట్లే బౌలింగ్‌లో బెన్ డకెట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చెత్త షాట్ సెలక్షన్‌తో వికెట్ పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లే స్పోర్ట్స్ 18తో మాట్లాడుతూ గిల్ బ్యాటింగ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ.. గిల్ స్ట్రైక్ రొటేట్ చేయలేకపోతున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో గిల్ నేర్చుకోవాలి. ఒకవేళ తను నంబర్ 3లోనే కొనసాగాలని కోరుకుంటే.. ముఖ్యంగా భారత పిచ్‌లపై వన్‌డౌన్‌లో నెగ్గుకురావాలనే సంకల్పంతో ఉంటే.. స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యూహాలు రచించాలి.
ద్రవిడ్, పుజారాలా రాణించాలనుకుంటే
లేదంటే స్ట్రైక్ రొటేట్ చేస్తూ పోవాలి. గురువారం అతడు బాగానే బ్యాటింగ్ చేశాడు. కానీ శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో చెత్త షాట్‌తో వికెట్ సమర్పించుకున్నాడు. నేను మళ్లీ చెప్తున్నా... పుజారా, ద్రవిడ్‌లా వన్‌డౌన్‌లో రాణించాలనుకుంటే కచ్చితంగా గిల్ స్ట్రైక్ రొటేట్ చేయాల్సిందే. స్పిన్ బౌలింగ్ ఆడేటపుడు మణికట్టును ఎక్కువగా ఉపయోగించాలి. షాట్ల ఎంపికలోనూ జాగ్రత్త వహించాలి’’ అని కుంబ్లే.. గిల్ ఆట తీరును ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.
చదవండి: ICC: అవార్డుల విజేతలు, జట్ల పూర్తి జాబితా! జింబాబ్వేకే ఆ పురస్కారం
Comments
Please login to add a commentAdd a comment