సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 నుంచి తెలంగాణ ప్రజలను రక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో తాము కూడా భాగం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వెల్లడించింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ సెంటర్‌గా ఉపయోగించునేందుకు ఇస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ ప్రకటించారు. వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడేలా స్టేడియంలో 40 పెద్ద గదులు ఉన్నాయని, అతి పెద్ద పార్కింగ్ సదుపాయం ఉండటం వల్ల కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందని హెచ్‌సీఏ పేర్కొంది. కరోనాను ఎదుర్కొనే క్రమంలో సామాజిక బాధ్యతగా తాము స్టేడియాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చామని అసోసియేషన్ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment