HCA: అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు | ED Issues Summons To Azharuddin Over HCA Related Issue | Sakshi
Sakshi News home page

HCA: అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు

Published Thu, Oct 3 2024 10:41 AM | Last Updated on Thu, Oct 3 2024 12:56 PM

ED Issues Summons To Azharuddin Over HCA Related Issue

టీమిండియా మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(HCA) మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ అజారుద్దీన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు జారీ చేసింది. హెచ్‌సీఏలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదు అందిన నేపథ్యంలో సమన్లు ఇచ్చింది. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో 1984- 2000 వరకు అజారుద్దీన్‌ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.

తన కెరీర్‌లో మొత్తంగా 99 టెస్టులు, 334 వన్డేలు ఆడిన ఈ హైదరాబాదీ.. సంప్రదాయ క్రికెట్‌లో 6215, యాభై ఓవర్ల ఫార్మాట్‌లో 9378 పరుగులు సాధించాడు. విజయవంతమైన బ్యాటర్‌గా పేరొందిన అజారుద్దీన్‌ కెప్టెన్‌గానూ సేవలు అందించాడు. అయితే, ఫిక్సింగ్‌ ఆరోపణలతో అతడి కీర్తిప్రతిష్టలు మసకబారగా.. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.

ఈ క్రమంలో 2020 - 2023 మధ్యలో హెచ్‌సీఏలో దాదాపు రూ. 3.8 కోట్ల మేర  అక్రమాలు జరిగాయంటూ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. విచారణలో భాగంగా.. క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్ ఎక్విప్‌మెంట్‌, ఫైర్ ఎక్విప్మెంట్, బకెట్ చైర్స్ కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు గుర్తించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‌కు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో అజారుద్దీన్‌ ఇప్పటికే ముందస్తు బెయిల్‌ పొందాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement