![India VS Australia T20I Match In Hyderabad Uppal Stadium: Tickets Price And Where to Buy - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/14/Untitled-6.jpg.webp?itok=VRGcw4hg)
IND VS AUS 3rd T20: రెండేళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిధ్యమివ్వనుంది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఈ నెల 20 నుంచి భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్.. ఉప్పల్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 25న జరిగే మూడో టీ20లో టీమిండియాతో తలపడనుంది.
ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు రేపటి (సెప్టెంబరు 15) నుంచి అందుబాటులోకి వస్తాయి. పేటీయం ఇన్‌సైడర్ (ఆన్‌లైన్) ద్వారా, అలాగే స్టేడియం వద్దనున్న ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా వీటిని అభిమానులు కొనుగోలు చేయవచ్చు. టికెట్ ధరలు రూ. 800 నుంచి ప్రారంభమవుతాయి. జీఎస్‌టీ అదనంగా ఉంటుంది. టికెట్ల ధరల్లో విద్యార్ధులకు ప్రత్యేక డిస్కౌంట్ ఉండనుంది.
కాగా, టీ20 వరల్డ్‌కప్‌కు ముందు జరిగే టీ20 సిరీస్ కావడంతో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా.. సౌతాఫ్రికాతో మరో టీ20 సిరీస్, వన్డే సిరీస్ కూడా ఆడనుంది. అనంతరం రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది.
ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహాల్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్
Comments
Please login to add a commentAdd a comment