ఐపీఎల్ 2023 సందర్భంగా గాయపడి, ఆరు నెలల తర్వాత బరిలోకి దిగిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రీఎంట్రీలో సత్తా చాటాడు. వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (సెప్టెంబర్ 29) జరుగుతున్న మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన కేన్ మామ అదిరిపోయే అర్ధసెంచరీతో ఇరగదీశాడు. ఈ మ్యాచ్‌లో 50 బంతులు ఎదుర్కొన్న అతను 8 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేసి రిటైర్డ్ అయ్యాడు.
ఫలితంగా పాక్ నిర్ధేశించిన 346 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే దిశగా న్యూజిలాండ్ ముందుకు సాగుతుంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రచిన్ రవీంద్ర ఎవరూ ఊహించని విధంగా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. రచిన్ 66 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్ సాయంతో 88 పరుగులు చేసి సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ రెండో ఓవర్‌లోనే వికెట్ కోల్పోయినప్పటికీ (కాన్వే (0)) ఏమాత్రం తడబడకుండా లక్ష్యం దిశగా దూసుకెళ్తుంది. 21 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 159/1గా ఉంది. రచిన్‌కు జతగా డారిల్ మిచెల్ (9) క్రీజ్‌లో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (94 బంతుల్లో 103 రిటైర్డ్ ఔట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా.. బాబర్ ఆజమ్ (84 బంతుల్లో 80; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అదిరిపోయే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో సౌద్ షకీల్ (53 బంతుల్లో 75; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అఘా సల్మాన్ (23 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), షాదాబ్ ఖాన్ (11 బంతుల్లో 16; 2 సిక్సర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (3 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) బ్యాట్ ఝులిపించారు. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (14), ఇమామ్ ఉల్ హాక్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment