
భారత గడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఇరగదీశాడు. వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 29) జరుగుతున్న మ్యాచ్‌లో బాబర్ చెలరేగిపోయాడు. 84 బంతులత్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
బాబర్‌తో పాటు మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తున్న మొహమ్మద్ రిజ్వాన్ సైతం భారత్‌లో ఆడిన తన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేశాడు. రిజ్వాన్ 53 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. వీరిద్దరూ అర్ధసెంచరీలతో రాణించడంతో వార్మప్ గేమ్‌లో పాక్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. 32 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.
రిజ్వాన్ (62), సౌద్ షకీల్ (5) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (14), ఇమామ్ ఉల్ హాక్ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్‌కు మధ్యలో కాసేపు వరుణుడు ఆటంకం కలిగించాడు. చిన్నపాటి వర్షం కావడంతో మ్యాచ్ ఓవర్ల కోతకు గురికాకుండా కొనసాగుతుంది.
మరోవైపు ఇవాలే జరుగుతున్న మరో వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక.. 40 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 202 పరగులు చేసింది. ధనంజయ డిసిల్వ (45), కరుణరత్నే క్రీజ్‌లో ఉన్నారు. తిరువనంతపురంలో ఇవాళ జరగాల్సిన సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది.
Comments
Please login to add a commentAdd a comment