అఫ్గన్‌పై పాక్ ఘన విజయం(PC: PCB Twitter)
Afghanistan vs Pakistan, 1st ODI: అఫ్గనిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాకిస్తాన్ విజయంతో ఆరంభించింది. శ్రీలంకలోని హంబన్‌టోటాలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 142 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా తన పేరిట ఉన్న పాత రికార్డును బద్దలు కొట్టింది.
కాగా తొలి వన్డేలో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, అఫ్గన్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ క్రమంలో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ అర్ధ శతకంతో(61)తో రాణించగా.. షాబాద్ ఖాన్ 39 పరుగులతో పర్వాలేదనిపించాడు.
చుక్కలు చూపించిన రవూఫ్
మిగతా వాళ్లు నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో పాకిస్తాన్ 201 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్‌కు పాకిస్తాన్ పేసర్ హారిస్ రవూఫ్ చుక్కలు చూపించాడు. 6.2 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు కూల్చాడు.
రవూఫ్ దెబ్బకు అఫ్గన్ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. 19.2 ఓవర్లలో 59 పరుగుల వద్ద అఫ్గన్ కథ ముగిసిపోయింది. అఫ్గన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించిన హారిస్ రవూఫ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
పాత రికార్డు బద్దలు కొట్టిన పాక్.. చెత్త రికార్డుతో అఫ్గన్
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో 142 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన బాబర్ ఆజం బృందం సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో గెలుపు నమోదు చేసిన పాక్ జట్టుగా నిలిచింది.
అంతకు ముందు 1998లో శ్రీలంకపై పాకిస్తాన్ 110 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడు అఫ్గన్‌పై విజయంతో ఈ రికార్డును బాబర్ బృందం చెరిపేసింది. కాగా వన్డేల్లో అఫ్గనిస్తాన్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.
చదవండి: Ind Vs Ire: ప్రయోగానికి ఆఖరి అవకాశం .. జితేశ్, షహబాజ్‌లకు ఛాన్స్!
A spectacle of pace, intensity and pure fire! 🚀🔥
— Pakistan Cricket (@TheRealPCB) August 22, 2023
Witness the explosive magic of @HarisRauf14's five-wicket haul ✨#AFGvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/cEG8HoPl63
Comments
Please login to add a commentAdd a comment