వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ జట్టుకు మంచి ఆరంభం లభించింది. హైదరాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన తమ మొదటి మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. మహ్మద్ రిజ్వాన్(68), సౌధ్ షకీల్(68) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటంతో 286 పరుగులు సాధించింది. అనంతరం బౌలింగ్‌లో హారీస్ రవూఫ్, హసన్ అలీ చెలరేగడంతో డచ్ జట్టు 205 పరుగులకు ఆలౌటైంది.
రవూఫ్‌ను కొట్టిన బాబర్..
ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సరదగా పేసర్ హ్యారీస్ రవూఫ్ చెంపపై కొట్టాడు. రవూఫ్ తన ఓవర్ వేసేందుకు సిద్దమవుతుండగా బాబర్ ఏదో చెప్పడానికి వెళ్లి నవ్వుతూ చెంపపై టచ్ చేశాడు.
దీంతో రవూఫ్ కూడా నవ్వుతూ ఎదో అన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో రవూఫ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 9 ఓవర్లలో 43 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.
చదవండి: థాంక్యూ హైదరాబాద్.. చాలా సంతోషంగా ఉంది! క్రెడిట్ మొత్తం వాళ్లకే: బాబర్
— cricbaaz2 (@cricbaaz2) October 6, 2023
Comments
Please login to add a commentAdd a comment