ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో పాకిస్తాన్ జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (86 బంతుల్లో 60; 4 ఫోర్లు, సిక్స్), మహ్మద్ రిజ్వాన్ (79 బంతుల్లో 67; 6 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో రాణించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 110 పరుగులు జోడించారు. వీరిద్దరూ క్రీజ్‌లో ఉన్న దశలో పాక్ భారీ స్కోర్ చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే 22 పరుగుల వ్యవధిలోకి వీరిద్దరూ ఔట్ కావడంతో పాక్ ఢీలా పడిపోయి, తక్కున స్కోర్‌కే పరిమితమైంది.
ఆఖర్లో అఘా సల్మాన్ (33 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మహ్మద్ నవాజ్ (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్) వేగంగా ఆడటంతో పాక్ 250 పరుగుల మార్కు దాటింది. పాక్ ఇన్నింగ్స్‌లో ఫకర్ జమాన్ 27, ఇమామ్ ఉల్ హాక్ 13, సౌద్ షకీల్ 9, షాదాబ్ ఖాన్ 3, ఫహీమ్ అష్రాఫ్ 2, షాహీన్ అఫ్రిది 2 నాటౌట్ పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో గుల్భదిన్ నైబ్, ఫరీద్ మాలిక్ తలో 2 వికెట్లు.. ఫజల్ హక్ ఫారూకీ, ముజీబ్ ఉర్ రెహ్మన్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్ తొలి రెండు వన్డేలు గెలిచి, ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. పాక్ ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంతో పాటు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment