
పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజం మళ్లీ టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే ఈసారి పాక్ జట్టుకు కాకుండా భిన్నంగా అఫ్గానిస్తాన్ టెస్టు జట్టు సారథిగా బాబర్ కన్పించాడు. ఏంటి ఇది వినడానికి షాకింగ్‌గా ఉందా? అసలేం జరిగిందో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
అబుదాబి వేదికగా బుధవారం ఐర్లాండ్-అఫ్గానిస్తాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు అధికారిక బ్రాడ్‌క్రాస్టర్లు ఘోర తప్పిదం చేశారు. బ్రాడ్‌క్రాస్టర్లు అఫ్గానిస్తాన్ కెప్టెన్‌గా హస్మతుల్లా షాహిది బదులుగా బాబర్ ఆజంను స్క్రీన్‌పై చూపించారు. ఇది చూసిన అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.
ఆ తర్వాత తమ తప్పిదాన్ని గమనించిన ప్రసారకర్తలు బాబర్ స్ధానంలో షాహిదిని రిప్లేస్ చేశారు. అయితే అప్పటికే స్క్రీన్ షాట్లు తీసిన నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో అఫ్గానిస్తాన్‌కు ఎప్పుడు వెళ్లావు బాబర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో ఘోర ప్రదర్శన అనంతరం అన్ని ఫార్మాట్లలో పాక్ కెప్టెన్సీ నుంచి బాబర్ తప్పుకున్న సంగతి తెలిసిందే. బాబర్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో బీజీగా ఉన్నాడు.
చదవండి: యశస్వికి ‘డబుల్’...శ్రేయస్, కిషన్ అవుట్
He's everywhere🥰😂
— 𝑨𝙗𝒅𝙪𝒍𝙡𝒂𝙝 𝙎𝒖𝙡𝒕𝙖𝒏⁵⁶ (@Abdullahs_56) February 28, 2024
Jalwa hai Hamara😎#BabarAzam𓃵 pic.twitter.com/LdFqunZM5i